తెిలతెలవారుతున్నప్పుడు సెట్లో అడుగుపెట్టి, ఫుల్‌ లైట్స్ వెలు గుతున్న మిర్రర్‌ ముందు కూర్చుని, స్టాఫ్‌తో కబుర్లు చెబుతూ, మేకప్‌ వేసు కుంటూ, హెయిర్‌ స్టైల్స్ సెలక్ట్ చేసు కుంటూ, మధ్య మధ్యలో సోషల్‌ మీడియాలోకి తొంగి చూస్తూ ఉంటే.ఆ కిక్‌ ఎలా ఉంటుందో తెలుసా.? అని ఊరించి ఊరించి చెబుతున్నారు జిగేల్‌ రాణి.ఇంతకీ ఇన్ని మాటలు ఇప్పుడెందుకు చెబుతున్నట్టు మేడమ్‌ జీ? జిల్‌ జిల్‌ జిల్‌ జిల్‌.. జిగేలు రాణి అని నార్త్ ఆడియన్స్ త్వరలోనే నాన్‌ స్టాప్‌గా పాడుకుంటారేమో... ఏమో.. ఏంటి? కచ్చితంగా పాడుకుంటారు..ఇన్నాళ్లు ఏదో మిస్‌ఫైర్‌ అయింది కానీ, ఈ సారి మాత్రం గురి తప్పదు అని అంటున్నారు పూజా హెగ్డే. ఈ సారి ఐమూలగా చూశానంటే, కుర్రకారంతా నా వైపు చూడాల్సిందే అన్న ధీమా కనిపిస్తోంది ఈ భామలో.చాన్నాళ్ల తర్వాత షూటింగ్‌ సెట్‌కి హాజరయ్యారు పూజా హెగ్డే. షాహిద్‌ కపూర్‌ హీరోగా నటిస్తున్న దేవా లో నాయికగా నటిస్తున్నారు పూజా హెగ్డే. ఈ సెట్లో జాయిన్‌ అయిన విషయాన్ని షేర్‌ చేసుకున్నారు సిల్వర్‌ స్క్రీన్‌ పాలపిట్ట.నార్త్ లో దేవాతో పాటు మరో కు కూడా సంతకం చేశారు పూజా హెగ్డే. సౌత్‌లో యమా క్రేజ్‌ ఉన్నప్పుడు, నార్త్ ప్రాజెక్టులు కూడా అంతే గట్టిగా పూజా తలుపులు తట్టాయి. నార్త్ కి ప్రిఫరెన్స్ ఇచ్చిన పూజా, సౌత్‌ని లైట్‌ తీసుకున్నారు.దానికి తోడు సౌత్‌లో చేసిన కొన్ని లు ఆడక పోవడంతో, కెరీర్‌ కాస్త డైలమాలో పడింది. గతంలో జరిగిన మిస్టేక్‌ని రెక్టిఫై చేసుకునే పనుల్లో ఉన్నారట ఈ బ్యూటీ. సౌత్‌ నుంచి మంచి ఆఫర్‌ వస్తే, తప్పకుండా సైన్‌ చేయాలనుకుంటున్నారట.ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా అట్లీ దర్శకత్వం వహించే లో నాయికగా బుట్టబొమ్మను అనుకుంటున్నట్టు వస్తున్నాయి. అదే నిజమైతే మాత్రం బుట్టబొమ్మ కెరీర్‌ మళ్లీ గాడిలో పడ్డట్టే.

మరింత సమాచారం తెలుసుకోండి: