టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజుకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. మొన్న గేమ్ చేంజర్ సినిమాతో నష్టాలపాలు అయిన దిల్ రాజు ఇప్పుడిప్పుడే సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో... కోలుకుంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజుకు... మరో ఎదురు దెబ్బ తగిలింది. ఈ సారి ఐటీ శాఖ.. రూపంలో దిల్ రాజుకు... షాక్ తగిలింది. ఇవాళ ఉదయం నుంచి.. టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు ఇంటిపై... ఐటీ దాడులు జరుగుతున్నాయి.


దిల్ రాజు ఇంటిపై అలాగే ఆఫీస్ పై కూడా.... ఐటీ శాఖ అధికారులు దాడులు ప్రారంభించారు. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీ ఒక్కసారి ఉలిక్కిపడింది. ఇవాళ ఉదయం నుంచి హైదరాబాద్ నగరం వ్యాప్తంగా ఐటి దాడులు జరుగుతున్నాయి. ఏకకాలంలో ఎనిమిది చోట్ల ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్,  కొండాపూర్ అలాగే గచ్చిబౌలి ప్రాంతాల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి.


అయితే ఇందులో ప్రముఖులు ఉన్నారు. ముఖ్యంగా ఐటీ శాఖ దాడులు దిల్ రాజు ఇంటిపై అలాగే ఆయన ఆఫీస్ పై జరగడం జరిగింది. దిల్ రాజు కుటుంబ సభ్యుల ఇంటిపై కూడా ఐటి శాఖ దాడులు జరుగుతున్నాయి. ఆయన కూతురు... హన్సిక రెడ్డి నివాసాల పైన కూడా ఐటి శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. దిల్ రాజు సోదరుడు శిరీష్ ఇంటిపై కూడా ఐటి సోదాలు జరుగుతున్నాయి.


మన సంక్రాంతి సందర్భంగా రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్, అలాగే విక్టరీ వెంకటేష్ చేసిన సంక్రాంతికి వస్తున్నాం అనే బడా సినిమాలు తీశారు దిల్ రాజు. అయితే ఈ సినిమాకు కోట్లల్లో ఖర్చుపెట్టిన దిల్ రాజు... కొంతమేర నష్టపోయిన... లాభాలు కూడా వచ్చాయి. అయితే ఇలాంటి నేపథ్యంలోనే ఒక్కసారిగా ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహించడం జరిగింది. ఇవాళ రాత్రి వరకు టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు ఇళ్లు, ఆఫీసులపై సోదాలు నిర్వహించనున్నారట.  దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: