టాలీవుడ్ ఇండస్ట్రీ లో చాలా సంవత్సరాల క్రితం అదిరిపోయే రేంజ్ జోష్ లో కెరియర్ను ముందుకు సాగించిన హీరోయిన్లలో విజయశాంతి ఒకరు. ఈమె హీరోయిన్గా కెరీర్ ను మొదలు పెట్టాక చాలా తక్కువ కాలంలోనే మంచి విజయాలు అందుకొని అద్భుతమైన స్థాయికి చేరుకుంది. ఈమె ఆ సమయంలో ఎన్నో కమర్షియల్ సినిమాలలో నటించి తన అందాలతో , డ్యాన్స్ తో ప్రేక్షకులను అద్భుతమైన స్థాయిలో ఆకట్టుకుంది. అలా టాలీవుడ్ ఇండస్ట్రీ లో తన నటనతో , డ్యాన్స్ తో , అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకొని తనకంటూ ఒక గొప్ప గుర్తింపును సంపాదించుకున్న విజయశాంతి ఆ తర్వాత లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటించడం మొదలు పెట్టింది.

లేడీ ఓరియంటెడ్ సినిమాల ద్వారా ఈమెకు అద్భుతమైన విజయాలు దక్కాయి. దానితో ఈమెకు స్టార్ హీరో స్థాయిలో గుర్తింపు వచ్చింది. అలా కొంత కాలం పాటు కెరీర్ను కొనసాగించిన ఈమె ఆ తర్వాత రాజకీయాలపై ఇంట్రెస్ట్ చూపించి సినిమాలకు దూరం అయింది. కొంత కాలం క్రితం ఈమె మహేష్ బాబు హీరోగా రూపొందిన సరిలేరు నీకు ఎవరు సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటించింది. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో ఈమెకి మంచి గుర్తింపు వచ్చింది. ఇకపోతే తాజాగా విజయశాంతి , కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన అర్జున్ S/O వైజయంతి అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ లో విజయశాంతి , కళ్యాణ్ రామ్ కి తల్లి పాత్రలో నటించింది. తాజాగా ఈ మూవీ థియేటర్లలో విడుదల అయింది. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు ఓ ఈవెంట్ ఏర్పాటు చేశారు.

అందులో భాగంగా విజయశాంతి మాట్లాడుతూ ... బాగున్న సినిమాలకి బాగోలేదు అని , బాగోలేని సినిమాలకు బాగుంది అని కొంత మంది రివ్యూలు ఇస్తున్నారు. వాళ్లకి నా వార్నింగ్. మీకు డబ్బులు ఇచ్చే వాళ్ళకి చెంచాగిరి చేయండి. మా సినిమాని అస్సలు నెగిటివ్ చేయకండి అంటూ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం విజయశాంతి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: