యంగ్ హీరోగా ‘దేవదాసు’ మూవీతో ఎంట్రీ ఇచ్చిన రామ్ దశాబ్ధాలు గడిచిపోతున్నప్పటికీ ఇంకా టాప్ హీరోల లిస్టులోకి చెరలేకపోతున్నాడు. ఒక హిట్ వస్తే వరసపెట్టి ఆతరువాత అతడిని ఫ్లాప్ లు వెంటాడటం ఒక సాంప్రదాయంగా మారింది. ప్రస్తుతం రామ్ మళ్ళీ వరస ఫ్లాప్ ల మధ్య సతమతమైపోతున్నాడు.



ఇలాంటి పరిస్థితుల మధ్య రామ్ కెరియర్ కు కన్నడ టాప్ హీరో ఉపేంద్ర ఏమైనా సహాయం చేయగలదా ఆన్న ఆశక్తి ఇండస్ట్రీ వర్గాలలో ఉంది. గతంలో అనుష్క తో ‘మిస్ శెట్టి మిష్టర్ పోలిశెట్టి’ మూవీలను తీసే మంచి విజయం సాధించిన మహేష్ బాబు దర్శకత్వంలో రూపొందుతున్న మూవీలో రామ్ పక్కన ఉపేంద్ర ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒక డిఫరెంట్ కథతో నిర్మాణం జరుపుకుంటున్న ఈ మూవీకి ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ అన్న టైటిల్ ఫిక్స్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.



మే 15న వచ్చే రామ్ పుట్టినరోజుననాడు ఈమూవీ టైటిల్ ను అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం. వాస్తవానికి ఈమూవీ కథలో హీరో రామ్ పాత్ర తో సరిసమానంగా మరో పాత్ర ఉంటుందని సమాచారం. ఈపాత్రను ఒక సీనియర్ హీరో తో చేయించాలని ఈమూవీ యూనిట్ భావించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఈమూవీ దర్శక నిర్మాతలు మోహన్ లాల్ ను సంప్రదిస్తే అతడు చెప్పిన భారీ పారితోషికం ఈమూవీ నిర్మాతలకు షాక్ ఇచ్చినట్లు టాక్.



దీనితో ఈ మూవీ నిర్మాతలు ఈపాత్రకు కన్నడ పాత్రకు అన్నివిధాలా సరిపోతాడాని భావించి ఉపేంద్రమ్ అడగడం అతడు ఓకె చేయడం న్నీ జరిగిపోయాయి అని అంటున్నారు. ఉపేంద్ర కు కు కన్నడ ప్రేక్షకులలో ఉన్న క్రేజ్ రీత్యా రామ్ సినిమాకు కన్నడ ప్రేక్షకులలో మంచి క్రేజ్ వస్తుంది అన్న అంచనాలతో ఈమూవీ నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకుని ఉంటారు అని అంటున్నారు. ఏది ఎలా ఉన్నా ఈసినిమా అయినా రామ్ కోకున్న హీట్ ఇస్తుందో లేదో వేచి చూడడాలి..  




మరింత సమాచారం తెలుసుకోండి: