టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోలు ఉన్న సంగతి తెలిసిందే. అందులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఎంత చెప్పినా తక్కువ అవుతుంది. ఈ హీరో తన కెరీర్ లో ఇప్పటివరకు ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో నటించి సక్సెస్ఫుల్ స్టార్ హీరోగా తన కెరీర్ కొనసాగిస్తున్నాడు. గంగోత్రి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ హీరో పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా మారాడు. రీసెంట్ గా ఈ హీరో నటించిన పుష్ప-2 సినిమా మంచి విజయాన్ని అందుకుంది.


ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించగా... రష్మిక మందన హీరోయిన్ గా చేసింది. ఈ సినిమాను కేవలం 400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించగా ఈ సినిమా అత్యంత ఎక్కువ కలెక్షన్లను రాబట్టింది. దాదాపు 1800 కోట్లకు పైనే కలెక్షన్లను రాబట్టి అత్యంత ఎక్కువ కలెక్షన్లు రాబట్టిన సినిమాగా పుష్ప-2 సినిమా నిలిచిపోయింది. ఈ సినిమా అనంతరం అల్లు అర్జున్ కాస్త గ్యాప్ తీసుకుంటున్నారు. తన తదుపరి సినిమాను డైరెక్టర్ అట్లితో కలిసి నటించబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతోంది. "AA 22" అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. 


కాగా, ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ ను అనుకుంటున్నారట. ఇదిలా ఉండగా.... ఈ సినిమాలో నటించడానికి అల్లు అర్జున్ భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్నారట. దాదాపు 175 కోట్ల వరకు అల్లు అర్జున్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట. ఇక డైరెక్టర్ అట్లీ ఏకంగా 125 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారట. ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కించనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి కథను సిద్ధం చేసుకుని అట్లీ సిద్ధంగా ఉన్నారట. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైనకు వెళ్లనుంది. ఈ సినిమానూ వచ్చే సంవత్సరంలో రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. ఇక ఈ సినిమాకు సంబంధించి మరింత సమాచారం త్వరలోనే వెలువడనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: