- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లైన్ అప్ లో ఉన్న సినిమాలలో సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ ఒకటి. అటు హను రాఘవపూడి .. ఇటు సందీప్ రెడ్డి వంగ ఆ పైన సలార్ 2 - కల్కి 2 ఇక మారుతీ దర్శకత్వంలో అన్నింటికన్నా ముందుగా వచ్చే రాజాసాబ్ ఇలా అన్ని సూపర్ డూపర్ ప్రాజెక్టు లే ఇక వీటితో పాటు ప్రశాంత్ వర్మ సినిమా కూడా ఉంది. వరుసుగా చూసుకుంటే మారుతి రాజాసాబ్ - హ‌ను రాఘ‌వపూడి ఫౌజీ - సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ - నాగ్ అస్విన్ కల్కి 2 - ప్రశాంత్ నీల్‌ సలార్ 2 ఆ తర్వాత ప్రశాంత్ వర్మ సినిమా అన్నది ఇప్పటివరకు జనాలకు తెలిసిన సంగతి ... కానీ ఈ ఆర్డర్ మారుతున్నట్టు కనిపిస్తుంది. ప్రభాస్ తన లైన ప్ ను కాస్త అటు ఇటుగా మారుస్తున్నారు అన్న సందేహాలు టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి. ఈ లైను నుంచి స్పిరిట్ వెనక్కు వెళ్లిపోయినట్టు తెలుస్తోంది.


తనకు చాలా కంఫర్టబుల్గా ఉండే దర్శకులతో పనిచేయటానికి ప్రభాస్ ఎక్కువగా ఇష్టపడతారు. మరీ ఎక్కువ ఇబ్బంది పెట్టే దర్శ‌కులతో పనిచేయటానికి కాస్త అటు ఇటు ఆలోచిస్తారు అన్నది ఇప్పటివరకు ఉన్న గుసగుసలు. ఈ క్రమంలో సందీప్ వంగా చాలా కండిషన్లు పెడుతున్నారని వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో ప్రభాస్ ప్రశాంత్ వర్మ ప్రాజెక్టును ముందుకు తీసుకువచ్చి సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ సినిమాను చివరికి పంపేసినట్టు తెలుస్తోంది. ప్రశాంత్ వర్మ ప్రభాస్ సినిమాకు హీరోయిన్గా భాగ్యశ్రీ బోర్సే ను తీసుకుంటున్నారని సమాచారం. ఈ మేరకు ఆమె డేట్లు అవైలబిలిటీ కోసం సంప్రదించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె విజయ్ దేవరకొండ - రామ్ సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ ఇటలీలో విశ్రాంతి తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఆయన ఇండియాకు వచ్చాక ఈ లైన్ పై పూర్తి క్లారిటీ రానుంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.


మరింత సమాచారం తెలుసుకోండి: