టాలీవుడ్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు గురించి పరిచయం అనవసరం. ఇటీవలే ఈ అందాల భామ 38వ పుట్టినరోజు జరుపుకుంది. ప్రస్తుతం ఈమె నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పథకంపై శుభం అనే సినిమాని నిర్మించింది. ఈ సినిమా మే 9న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా నటి సమంత ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈమె మాట్లాడుతూ.. తనకు రిస్క్ తీసుకోవడం అంటే ఇష్టమని..  సవాళ్లను ఎదుర్కోవడం కూడా ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చింది. 15 ఏళ్ల కెరీర్ లో తను ఎన్నో తెలుసుకున్నట్టు తెలిపింది.  ఆ అనుభవాలన్నిటితోనే ఇప్పుడు నిర్మాతగా మారినట్లు చెప్పింది. సినిమాలలో నటిగా కంటే కూడా నిర్మాతగా ఎక్కువ బాధ్యతలు ఉంటాయని తను తెలుసుకున్నట్టు చెప్పుకొచ్చింది.  అలాగే తను నటిగా కంటే నిర్మాతగానే ఎక్కువ విషయాలను నేర్చుకున్నట్లు స్పష్టం చేసింది. నిర్మాతగా డిఫరెంట్ కథలను రూపొందిస్తానని సమంత వెల్లడించింది.  అలాగే త్వరలో రాబోతున్న శుభం సినిమా ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుందని ధీమా వ్యక్తం చేసింది.

ఈమె తెలుగుతో పాటు తమిళ సినీ ఇండస్ట్రీలో కూడా చాలా సినిమాల్లో నటించింది. సమంత హిందీ, మలయాళం భాషల్లో కూడా సినిమాలు చేసింది. ఈ బ్యూటీ స్టార్ హీరోయిన్ ల లిస్టులో ఒకరిగా స్థానం సంపాదించుకుంది. అయితే ఈ అందాల భామ ఇప్పటికే నాలుగు ఫిలిం ఫేర్ అవార్డులు , రెండు నంది అవార్డులు సహా అనేక అవార్డులు సొంతం చేసుకుంది.

 
ఇకపోతే ఈ బ్యూటీ అత్తరింటికి దారేది, ఏం మాయ చేసావె, ఓ బేబీ, యశోద, రామయ్య వస్తావయ్యా, అఆ లాంటి మంచి మంచి సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. సామ్ తన అందం, అభినేయంతో ఎంతమంది ప్రేక్షకుల మనసును దోచుకుంది. సమంత రూత్ ప్రభు నటనకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈ అందాల భామ ఏ పోస్ట్ పెట్టిన సరే లక్షల్లో లైకులు, కామెంట్లు వస్తుంటాయి. సమంతకి కేవలం టాలీవుడ్ లోనే కాదు, అటు బాలీవుడ్.. ఇటు కొలివుడ్ లో కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు. సామ్ అంటే ఇష్టపడని వారుండారు. ఇటీవలే ఈ భామ కోలీవుడ్ గోల్డెన్ క్వీన్ అవార్డుని కూడా సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: