టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ట్ డైరెక్టర్‌ల‌లో ఒకరైన గోపీచంద్ మలినేని.. ప్రస్తుతం బాలీవుడ్‌లోను వంద కోట్ల దర్శకుడుగా ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. తాజాగా.. సన్నీ డియోల్‌తో జాట్ సినిమాను రూపొందించి బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో రూ.100 కోట్లు కలెక్షన్లు కొల‌గొట్టి మంచి సక్సెస్ అందుకున్న గోపిచంద్.. ఇప్పుడు మరోసారి బాలయ్యతో సినిమాను రూపొందించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇలాంటి క్రమంలో గోపీచంద్ మ‌లినేని.. తాజా ఇంటర్వ్యూలో పాల్గొని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.


జాట్ స‌క్స‌స్ య సెలబ్రేషన్స్‌లో సందడి చేస్తున్నాడు. ఇప్పటికే సౌత్ మేకర్‌ల‌కు బాలీవుడ్‌ ఆడియన్స్‌లో విపరీతమైన గిరాకీ పెరిగింది. ఇలాంటి క్రమంలో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌తో వింటేజ్ సన్నీ డియోల్‌ను చూపించాడంటూ అక్కడి ఆడియన్స్ గోపీచంద్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ లో గోపీచంద్ సినిమాలకు మరింత మార్కెట్ పెరిగింది. బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే సక్సెస్ సాధించడమే కాదు ఈ సినిమాలో ఆయన మేకింగ్, విజన్ కు మంచి మార్కులు పడ్డాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా గోపీచంద్ తన నెక్స్ట్ సినిమా పై ఫోకస్ పెట్టినట్లు సమాచారం. . గతంలో వీర సింహారెడ్డి తో బ్లాక్ బస్టర్ కొట్టిన గోపీచంద్ బాలయ్యతో మరో పవర్ ఫుల్ యాక్షన్ సినిమాను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడట.


కాగా.. ఇటీవల ఇంటర్వ్యూలో గోపీచంద్ మాట్లాడుతూ డైరెక్టర్గా కెరీర్ ప్రారంభించే కంటే ముందే.. ఎన్నో సినిమాలుకు అసిస్టెంట్ డైరెక్టర్గా, అసోసియేటివ్ డైరెక్టర్గా వ్యవహరించాన‌ని చెప్పుకొచ్చాడు. అయితే అందరివాడు టైంలో చిరంజీవి చెప్పిన సలహాలు.. స్టాలిన్ టైంలో తాను నేర్చుకున్న పాఠాలు.. తను దర్శకుడుగా మారిన తర్వాత చాలా ఉపయోగపడ్డాయని.. ఈ సినిమాలా తర్వాత తను పూర్తిగా చేంజ్ అయిపోయాను అంటూ గోపీచంద్ వివరించాడు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని కామెంట్స్ నెటింట వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: