నాచురల్ స్టార్ నాని ఆఖరుగా సరిపోదా శనివారం అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి అయినటువంటి ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా నటించగా ... వివేక్ ఆత్రేయ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ అయ్యింది. ఇకపోతే తాజాగా నాని , శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన హిట్ ది థర్డ్ కేస్ సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ ని మే 1 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు.

మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టికెట్ బుకింగ్లను ఈ మూవీ బృందం వారు ఓపెన్ చేశారు. ఈ మూవీ టికెట్ బుకింగ్లకి అద్భుతమైన రెస్పాన్స్ జనాల నుండి లభిస్తుంది. ఇకపోతే ఈ మూవీ టికెట్ బుకింగ్ల విషయంలో బుక్ మై షో ఆప్ లో ఈ మూవీ సరిపోదా శనివారం సినిమాను భారీ మార్జిన్ తో క్రాస్ చేసింది. అసలు విషయం లోకి వెళితే ... సరిపోదా శనివారం సినిమా విడుదలకు మూడు రోజుల ముందు ఈ మూవీ కి సంబంధించిన 48.2 కే టికెట్స్ బుక్ మై షో ఆప్ లో సేల్ కాగా ... హిట్ ది థర్డ్ కేస్ మూవీ కి సంబంధించిన సినిమాకు సంబంధించిన టికెట్లు బుక్ మై షో ఆప్ లో మూడు రోజులకు ముందు 88.2 కే సేల్ అయ్యాయి.

ఇలా చూసుకున్నట్లయితే విడుదలకు మూడు రోజుల ముందు సరిపోదా శనివారం సినిమాతో పోలిస్తే హిట్ ది థర్డ్ కేస్ మూవీ కి సంబంధించిన టికెట్లు బుక్ మై షో యాప్ లో భారీ ఎత్తున సేల్ అయ్యాయి. దీనితోనే అర్థం అవుతుంది హిట్ ది థర్డ్ కేస్ మూవీ పై ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో అంచనాలు ఉన్నాయి అనేది. మరి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు కలిగి ఉన్న హిట్ ది థర్డ్ కేస్ మూవీ బాక్సా ఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: