కోలీవుడ్ లో స్టార్ హీరో సూర్య తెలుగు ప్రేక్షకులలో కూడా మంచి క్రేజ్ ఉన్నది. తన సినిమాలను తెలుగు తమిళ భాషలలో రిలీజ్ చేస్తూ ఉంటారు. చివరిసారిగా కంగువ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూర్యసినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయితే ఆ తర్వాత సూర్య నటించిన తాజా చిత్ర రెట్రో డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు ఈ సినిమాకి డైరెక్షన్ వహించక పూజా హెగ్డే నటించింది. చాలా కాలం పాటు సైలెంట్ గా ఉన్న ఈ ముద్దుగుమ్మ రెట్రో సినిమాతో ఈ రోజున ఆడియన్స్ ముందుకి వచ్చింది. మరి ఏ మేరకు ఈ సినిమా సక్సెస్ అయ్యిందో చూద్దాం.


ఈ రోజున థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా ఎక్కడ కూడా ప్రీమియర్ షోస్ వెయ్యలేదు. దీంతో అటు ట్విట్టర్ లో కూడా రెట్రో సినిమాకి సంబంధించి రివ్యూస్ పెద్దగా కనిపించలేదని తెలియజేస్తున్నారు. విదేశాలలో సినిమాలను ముందుగా విడుదల చేస్తే పనిగట్టుకొని మరి చాలామంది నెగెటివిటీ చేస్తున్నారని విషయం పైన దర్శక నిర్మాతలు వేయలేదట. కోలీవుడ్ సినీ పరిశ్రమ మొత్తం కూడా వీటిని ఫాలో అవుతున్నట్లు సమాచారం.


సూర్య రెట్రో చిత్రంలో ఊర మాస్ లెవల్లో కనిపించబోతున్నారని.. కొన్నిచోట్ల మొదటి షో అయిపోయిందని బాగున్నట్లుగా ఆడియన్స్ తెలియజేస్తున్నారు.. సూర్య నటనతో సమానంగా పూజా హెగ్డే నటన కూడా ఉండదని బిజిఎం కూడా హైలెట్ గా ఉందంటూ ఆడియస్స్ తెలియజేస్తున్నారు. సినిమా మాత్రం ఎక్స్లెంట్ గా ఉందంటూ మరొక నేటిజన్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. సినిమా స్టోరీ అదిరిపోయేలా ఉందని ఇప్పుడే బుకింగ్స్ కూడా పెరుగుతున్నాయని సూర్య ఖాతాలో మరొక హిట్టు పడినట్లే అంటూ మరొక నేటిజన్ కూడా ట్విట్ చేయడం జరిగింది.


ప్రముఖ హీరో సాయి ధరమ్ తేజ్ కూడా సూర్య సినిమాకి బెస్ట్ విషెస్ తెలియజేశారు. రెట్రో సినిమా రొమాంటిక్, గ్యాంగ్స్టర్ యాక్షన్ నేపథ్యంలో పెరకెక్కించారు. మరి పూర్తి రివ్యూ తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: