టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన స్థాయికి చేరుకున్న నటీమణులు అనేక మంది ఉన్నారు. అలా తెలుగు సినీ పరిశ్రమలో కెరియర్ను మొదలు పెట్టిన తర్వాత అత్యంత తక్కువ కాలంలో అద్భుతమైన స్థాయికి చేరుకున్న నటీమణులలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. ఈ ముద్దుగుమ్మ సందీప్ కిషన్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందిన వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అనే మూవీ తో తెలుగు తేరకు పరిచయం అయింది. ఈ మూవీ మంచి విజయం సాధించడం , ఇందులో రకుల్ తన నటనతో , అందాలతో ప్రేక్షకులను కట్టి పడేయడంతో ఈ మూవీ ద్వారా ఈ నటికి టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు దక్కింది.

సినిమా తర్వాత ఈమెకు వరుస పెట్టి తెలుగు సినిమాలలో అవకాశాలు వచ్చాయి. అందులో కూడా చాలా మూవీలు మంచి విజయాలను సాధించడంతో ఈమెకు ఆ తర్వాత టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు దక్కాయి. దానితో ఈ బ్యూటీ తెలుగు లో కెరియర్ను మొదలు పెట్టిన తక్కువ కాలం లోనే స్టార్ హీరోయిన్స్ స్థాయికి చేరుకుంది. అలా తెలుగులో స్టార్ హీరోయిన్స్ కొనసాగిస్తున్న సమయం లోనే ఈమె తెలుగు సినిమాలకు ఆపేసి హిందీ , తమిళ్ సినిమాల్లో నటించడం పై ఆసక్తిని చూపిస్తోంది. ఆఖరుగా ఈ బ్యూటీ పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందిన కొండపలం అనే తెలుగు సినిమాలో హీరోయిన్గా నటించింది.

మంచి అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ మూవీ వచ్చి ఇప్పటికే చాలా కాలం అవుతుంది. ఈ సినిమా తర్వాత రకుల్ ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమాలో నటించలేదు. అలాగే ఏ తెలుగు మూవీ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ వరుస పెట్టి హిందీ , తమిళ్ సినిమాల్లో నటిస్తూ అద్భుతమైన జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: