తమిళ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్నటువంటి హీరోల్లో అత్యంత  ఆదరణ పొందిన  హీరో అజిత్ కుమార్.. ఈయన సినిమా ఇండస్ట్రీలో  నటించిన నటనకు గాను చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం గుర్తించి పద్మభూషణ్ పురస్కారం తాజాగా అందించింది. అలాంటి ఈ తరుణంలో అజిత్ కుమార్  ఇండస్ట్రీలోకి ఏ విధంగా వచ్చారు ఆయన ఎలాంటి  పరిస్థితిలు ఎదుర్కొన్నారు. ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏంటి అనేది తాజాగా ఒక ఆంగ్ల మీడియాకు ఇంటర్వ్యూ ద్వారా తెలిపారు. ఆ వివరాలు ఏంటో చూద్దాం.. అజిత్ అసలు ఇండస్ట్రీలోకి రావాలని ఎప్పుడూ అనుకోలేదట. ఆయన చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి ప్రధాన గోల్ రేసింగ్ లో అడుగు పెట్టడం. అలా రేసింగ్ చేసి మంచి స్థాయికి ఎదగాలని కలలుకనే వాడట. కానీ రేసింగ్ చేయాలంటే అప్పట్లో చాలా ఖర్చుతో కూడుకున్నది. ఖరీదైనటువంటి స్పోర్ట్స్  వాహనాలు కొనాలి. తన ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ అంతంత మాత్రం గానే ఉండడంతో స్పోర్ట్స్ బైక్స్ కొనడానికి అంతగా డబ్బులు లేకపోవడంతో ఆ కోరికను చంపేసుకున్నాడు. 

ఇదే తరుణంలో ఆయన ఒక ప్రభుత్వ రంగ సంస్థలో జాబు చేసే సమయంలో ఎవరో వచ్చి నువ్వు మోడలింగ్ వైపు వెళ్ళు ఆ దిశగా నీకు మంచి అవకాశాలు వస్తాయి చూస్తే చాలా బాగున్నావు అని చెప్పారట. అనుకోకుండా అజిత్ మోడలింగ్ రంగం వైపు అడుగులు వేశాడు. అలా  ముందుగా ఆయనకు తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచే ఆఫర్ వచ్చిందట. కానీ తెలుగులో మాట్లాడడం రాదు. నేర్చుకోవాలని ఎంతో ప్రయత్నించాను. ఇదే సమయంలో ఈ విషయాన్ని తన తల్లిదండ్రులతో చెప్పాను. కానీ వారు ఇండస్ట్రీకి మనకు పరిచయం లేదు అక్కడికి వెళ్లి ఎలా రానిస్తావని చాలా భయపడ్డారట. కానీ అజిత్ ధైర్యం చేసి సినీ ఫీల్డ్ లోకి అడుగు పెట్టాడు. అలా ఒక్కొమెట్టేక్కుతూ వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ ఇండస్ట్రీకే స్టార్ హీరోగా మారారు.

అయితే ఒక ఇంటర్వ్యూలో జర్నలిస్టు ఇండస్ట్రీలోకి ఎందుకు వచ్చావు ఎలా వచ్చావు అని అడిగారు. నేను బయట చాలా అప్పులు చేశాను అవి తీర్చుకోవడం కోసం మాత్రమే ఇండస్ట్రీకి వచ్చానని చెప్పాడు. ఇండస్ట్రీలోకి వస్తే డబ్బులు చాలా వస్తాయా  అని ప్రశ్నించాడు. నేను ఎలాగైనా కష్టపడి ఇండస్ట్రీలోనే డబ్బు సంపాదిస్తామని వచ్చాను కష్టపడ్డాను నా అప్పులు తీర్చుకున్నాను. ఈ రేంజ్ కి వచ్చానని చెప్పుకొచ్చారు. ప్రతిభ ఉంటే ఎక్కడైనా సాధించగలమని అజిత్ ఆ సందర్భంగా చెప్పారట. అలా రేసింగ్ లోకి వెళ్దాం అనుకున్నా అజిత్ చివరికి అనుకోకుండా ఇండస్ట్రీలోకి వచ్చి స్టార్ గా ఎదిగి  కేంద్ర ప్రభుత్వం చేత పద్మభూషణ్ అవార్డు కూడా అందుకున్నాడు. ఈ సందర్భంలోనే ఆయన ఇంటర్వ్యూలో తన లైఫ్ లో జరిగిన విషయాలను  బయట పెట్టడంతో అవి కాస్త వైరల్ గా మారాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: