తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది మాత్రమే వారి నటనతో మంచి గుర్తింపు సంపాదించుకుంటారు. అలాంటి వారిలో నటి త్రిష ఒకరు. ఈ చిన్నది తెలుగు పరిశ్రమకు పరిచయమైన అతి తక్కువ సమయంలోనే తన నటన అందచందాలతో మంచి గుర్తింపు అందుకుంది. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో నటించి ప్రేక్షకుల ప్రశంసలు పొందింది.


ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలలో హీరోయిన్ గా ఆడి పాడింది. త్రిష తెలుగుతోపాటు తమిళ, మలయాళ, కన్నడ సినిమాలలోనూ నటించి సక్సెస్ఫుల్ స్టార్ హీరోయిన్ గా తన కెరీర్ ను కొనసాగిస్తోంది. ఈ చిన్నది చిత్ర పరిశ్రమకు పరిచయమై దాదాపు చాలా సంవత్సరాలు అవుతుంది. త్రిష వయసు 40కి పైనే ఉన్నప్పటికీ ఏమాత్రం తరగతి అందం, ఫిట్నెస్ తో ఇప్పుడు కూడా సినిమాలలో నటిస్తోంది. తన నటన అందచందాలకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.

త్రిష వయసు పెరిగినప్పటికీ ఇంతవరకు ఎవరిని వివాహం చేసుకోకుండా సింగిల్ గానే తన లైఫ్ కొనసాగిస్తోంది. సినిమాలలో నటిస్తున్న సమయంలో కొంతమంది హీరోలతో ఎఫైర్ కొనసాగించినట్లుగా అనేక రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. అందులో త్రిష ఎవరిని కూడా వివాహం చేసుకోకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

ఇప్పటికీ కూడా త్రిషతమిళ హీరోతో ప్రేమలో ఉన్నట్టుగా, ఎఫైర్ కొనసాగిస్తున్నట్టుగా అనేక రకాల వార్తలు వైరల్ అవుతూనే ఉంటాయి. ఈ వార్తలపై త్రిష ఇంతవరకు స్పందించలేదు. ఇక త్రిష సక్సెస్ఫుల్ హీరోయిన్ గా 25 ఏళ్ల పాటు తన సినీ కెరీర్ కొనసాగిస్తోంది. కానీ త్రిష ఎవరిని వివాహం చేసుకోకుండా తన వ్యక్తిగత జీవితంలో సంతోషంగా లేదని తన కుటుంబ సభ్యులు ఆవేదనని వ్యక్తం చేస్తున్నారు. ఎవరో ఒక వ్యక్తిని వివాహం చేసుకుంటే చూడాలని తన కుటుంబ సభ్యులు ఎంతగానో చెబుతున్నారట. మరి త్రిష ఈ విషయం పైన ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: