చాలామంది నటీమణులు ఫేమస్ అయ్యాక పలు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ కి,పలు ఈవెంట్లకి వెళ్లిన సమయంలో అభిమానుల కారణంగా చేదు అనుభవాలకు గురవుతూ ఉంటారు. అలా తాజాగా ఈ రజినీకాంత్ బ్యూటీ కూడా షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి అని వెళ్లి అభిమానులతో చేదు అనుభవానికి గురైంది.మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటే రజినీకాంత్  వెట్టయాన్ మూవీ  నటి మంజు వారియర్..తమిళం,మలయాళ సినిమాలతో ఫేమస్ అయినటువంటి మంజూ వారియర్ రజినీకాంత్ వెట్టయాన్ సినిమాలో మనసిలాయో అనే పాట ద్వారా ఎంత ఫేమస్ అయిందో చెప్పనక్కర్లేదు. ఇక రీసెంట్గా మోహన్ లాల్ నటించిన ఎల్2 ఎంపురాన్ మూవీ లో కూడా కనిపించింది. 

అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ తాజాగా ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి వెళ్ళింది. అక్కడికి అభిమానులు అందరూ ఈమెని చూడడానికి గుమిగూడి రావడంతో కారు ఎక్కి వారిని రిసీవ్ చేసుకుంది మంజూ వారియర్.ఆ టైంలో ఓ వ్యక్తి మంజు వారియర్ నడుము గిళ్ళాడు. మరి కొంతమంది మంజూ వారియర్ ప్రైవేట్ పార్ట్ అయినటువంటి చెస్ట్ పార్ట్ ని టచ్ చేయడానికి చూశారు. కానీ వాళ్ళు చేసే పని గమనించిన మంజూ వారియర్ వెంటనే ఓ అభిమానికి సెల్ఫీ ఇచ్చేసి కార్లో కూర్చొని వెళ్ళిపోయింది.అలా గుంపులో గోవిందలాగా ఓ వ్యక్తి ఎవరికి దొరుకుతాంలే అని మంజు వారియర్ నడుము గిల్లాడు.

అయితే దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొట్టడంతో మంజూ వారియర్ కి జరిగిన చేదు అనుభవం పై చాలా మంది నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అభిమానం అభిమానం లాగే ఉండాలి కానీ మరీ వారిని ఇబ్బంది పెట్టేలా ఉండకూడదు అని కామెంట్లు పెడుతున్నారు. అయితే మంజూ వారియర్ ని అంత ఇబ్బంది పెట్టినా కూడా ఆమె ఆ ఇబ్బందిని ఫేస్ లో బయటికి కనిపించకుండా నవ్వుతో కవర్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ప్రస్తుతం మంజూ వారియర్ కి సంబంధించిన ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: