టాలీవుడ్ నందమూరి నట‌సింహం బాలకృష్ణ ప్రస్తుతం సినిమాల పరంగా ఫుల్ జోష్లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది సంక్రాంతికి వ‌రుస‌గా 4వ బ్లాక్ బస్టర్ కొట్టిన బాలయ్య ... రీసెంట్గా పద్మభూషణ్ అవార్డ్‌ను సైతం దక్కించుకున్నారు. బుల్లితెరపై అన్‌స్టాపబుల్ షోతో రాణిస్తున్నాడు. మరోపక్క రాజకీయాల్లోనూ సత్త చాటుతున్నాడు ... ఈ క్రమంలోనే బాలయ్యకు మహర్దశ నడుస్తుందంటూ ... పట్టిందల్లా బంగారమవుతుందంటూ రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా.. ఇటీవల కాలంలో బాలయ్య తన సినిమాలు విషయంలో పూర్తిగా పంథా మార్చేశాడు... . .


వ‌రుసగా. .. యంగ్ డైరెక్టర్‌లతో తన సినిమాలను నటించి బ్లాక్ బస్టర్లు అందుకుంటున్నాడు .. ఇలాంటి క్రమంలో బాలయ్యకు పర్సనల్‌గా తనకంటూ కొన్ని నియమాలను పెట్టుకొని వాటిని తూచా తప్పకుండా పాటిస్తాడంటూ ... టాలీవుడ్‌లో ఇలాంటి నియమాలు పాటించే ఏకైక హీరో బాలయ్య అంటూ న్యూస్ వైరల్‌గా మారుతుంది  .. .. అసలు మేటర్ ఏంటంటే......... బాలయ్య షూటింగ్‌ల‌లో ఎంత బిజీగా ఉన్నా.. ఇంటికి వచ్చి నిద్రించడానికి ఎంత ఆలస్యమైనా ... కచ్చితంగా ప్రతిరోజు ఉదయం 3:30కు నిద్రలేచే అలవాటు ఉందట. నిద్రలేవగానే భూమతకు నమస్కరించిన తర్వాతే పాదం నేలపై పెడతాడట  . . .. ..

 

అంతే కాదు.. స్నానం చేసి సూర్యోదయం లోపే పూజ చేసుకుని.. సూర్య నమస్కారాలు చేసుకుంటాడ‌ట‌. ఇక‌ టాలీవుడ్‌లోనే ఇలాంటి అలవాటు ఉన్న ఏకైక హీరో బాలయ్య కావ‌డం విశేష్. అంతేకాదు తెలుగు పద్యాలు, సంస్కృతంపై బాలయ్యపు మంచిపట్టు ఉంది. చిన్నతనం నుంచే ఆయనకు తెలుగుపై ఉన్న ఆసక్తితో ప్రత్యేకంగా మాస్టర్ దగ్గర శిక్షణ తీసుకునేవాడ‌ట బాల‌య్య‌. ఈ ప్రతిభ కలిగిన అతి తక్కువ మంది తెలుగు హీరోల్లో బాలయ్య ఒకరు  ... ఇక బాల‌య్య ప్ర‌స్తుతం అఖండ 2తో ఆడియ‌న్స్‌ను ప‌ల‌క‌రించ‌డానికి సిధ్ధం అవుతున్నాడు.  .. . .

మరింత సమాచారం తెలుసుకోండి: