
ఆ సినిమా మరేంటో కాదు "అంటే సుందరానికి". టాలీవుడ్ ఇండస్ట్రీలో నాచురల్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న హీరో నాని తనదైన స్టైల్ లో నటించిన ఈ సినిమాపై ఫస్ట్ నుంచి జనాలు ఓ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేశారు . మరి ముఖ్యంగా నజరియా నజీమ్ ఈ సినిమాలో హీరో నానితో స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది ..నానితో చిందులు వేయబోతుంది అని తెలియగానే మరింత స్థాయిలో సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ మొదలయ్యాయి . అయితే జనాల ఎక్స్పెక్టేషన్స్ ని మాత్రం ఈ సినిమా రీచ్ కాలేకపోయింది.
ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. సినిమాపై చాలా చక్కగా పాజిటివ్ గా మాట్లాడారు . సినిమాకి కావాల్సినంత సపోర్ట్ కూడా ఇచ్చారు. అయినా సరే ఈ సినిమాకి మాత్రం ఉపయోగపడలేక పోయింది . ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత నాని ఫ్యాన్స్ కూడా డిసప్పాయింట్మెంట్ వ్యక్తం చేశారు . అసలు ఈ సినిమాలో ఏముంది ..? ఎందుకు ఇంత హైప్ ఇచ్చారు..? అనే విధంగా మాట్లాడుకున్నారు . భారీ ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజైన ఈ సినిమా తుస్సుమంటూ పేలిపోయింది..!