
కాగా ప్రెసెంట్ అట్లీ దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు అల్లు అర్జున్ . ఈ సినిమాని వీలైనంత త్వరగా సెట్శ్ పైకి తీసుకురావాలి అని ఈ సినిమాతో సెన్సేషనల్ హిట్ తన ఖాతాలో వేసుకోవడమే కాకుండా ఇండియాకి మరో ఆస్కార్ అవార్డు తీసుకురావాలి అని ట్రై చేస్తున్నాడు . దానికి తగ్గటే కష్టపడుతున్నాడు. అయితే అట్లీ దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమా కంటే ముందే అల్లు అర్జున్ తెరపై కనిపించబోతున్నాడు అన్న వార్త ఇంట్రెస్టింగ్ గా మారింది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తుంది.
అల్లు అర్జున్ ఓ సినిమాలో స్పెషల్ గెస్ట్ రోల్ లో మెరవబోతున్నారట . ఆ సినిమా మరేంటో కాదు..బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య హీరోగా నటిస్తున్న అఖండ 2. యస్ ఈ న్యూస్ బాగా వైరల్ అవుతుంది. అఖండ 2 సినిమాలో ఒక స్పెషల్ క్యారెక్టర్ లో కేవలం రెండంటే రెండు నిమిషాలు మెరిసే పాత్ర కోసం అల్లు అర్జున్ సెలెక్ట్ అయ్యాడట . నిజానికి బన్నీ గెస్ట్ రోల్ లో మెరిసే టైప్ కాదు. కానీ బాలయ్య పై ఉన్న నమ్మకంతో అభిమానంతో ఈ మూబీ ఓకే చేశారట . అదే నిజమైతే మాత్రం అట్లీ దర్శకత్వం కంటే ముందే తెరపై కనిపించబోతున్నాడు బన్నీ అంటున్నారు అభిమానులు. చూద్దాం మరి ఏం జరుగుతుందో...???