త్రిష అలనాటి అందాల తార. సాంప్రదాయానికి పెట్టింది పేరు. నటనకు నటన, అందానికి అందం, మైమరిపించే చిరునవ్వుతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. త్రిష ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. ఎంతో మంది స్టార్ హీరోల సినిమాలలో నటించిన త్రిష బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ దీక్షకులను ఆకట్టుకుంటుంది. వయసు పెరిగినప్పటికీ అదే అందం, ఫిట్నెస్ కొనసాగిస్తూ కుర్ర కారు మతులు పోగొడుతోంది. త్రిష తెలుగుతో పాటు తమిళ సినిమాలలోనూ నటిస్తూ అభిమానుల మనసులను దోచుకుంటుంది. 


త్రిష నటిస్తున్న తాజా చిత్రం "విశ్వంభర". ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్నారు. వశిష్ట ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈరోజు త్రిష పుట్టినరోజు సందర్భంగా విశ్వంభర సినిమాలో ఆమె పాత్రను పరిచయం చేస్తూ చిత్ర యూనిట్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. "అవని" గా త్రిషాను పరిచయం చేస్తూ పోస్టర్ లో ఆమెకు స్పెషల్ గా విషెస్ తెలియజేశారు. ఆ పోస్టర్లు త్రిష చీర కట్టులో సాంప్రదాయంగా కనిపించి నవ్వుతూ ఉంది. ఈ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో తన అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

 ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాను జూలై నెలలో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా కోసం త్రిష అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. త్రిష, చిరంజీవి కాంబినేషన్లో ఇదివరకే వచ్చిన సినిమాలు మంచి విజయాలను అందుకోవడంతో విశ్వంభర సినిమాపై అభిమానులలో భారీ అంచనాలు నెలకొంటున్నాయి.


సినిమా అభిమానులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఇక ఈరోజు త్రిష పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా తన అభిమానులు తనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను వైరల్ చేస్తు త్రిషకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సినీ తారల సైతం త్రిషకు స్పెషల్ గా విషెస్ తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: