
నేచురల్ స్టార్ నాని నటించిన హిట్ 3 సినిమా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తోంది. నాలుగు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రు. 101 కోట్ల గ్రాస్ వసూళ్లు కొల్లగొట్టింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా పోస్టర్ ద్వారా ప్రకటించారు. అలాగే నాని సినిమాలకు కంచుకోట అయిన ఓవర్సీస్ మార్కెట్లో కూడా ఈ సినిమా 2 మిలియన్ డాలర్ల వసూళ్లు రాబట్టినట్టు మేకర్స్ ప్రకటించారు. నాని కెరీర్ లో దసరా - సరిపోదా శనివారం సినిమాల తర్వాత అత్యంత వేగంగా రు. 100 కోట్ల క్లబ్‌లోకి వెళ్లిన సినిమా గా హిట్ 3 సినిమా రికార్డులకు ఎక్కింది. ఓవర్సీస్ లో నాని నటించిన సినిమా లు ఏకంగా 11 .. 1 మిలియన్ డాలర్ల క్లబ్ లో చేరాయి. ఈ రికార్డు మహేష్ బాబుకు మాత్రమే ఉంది. మహేష్ నటించిన 12 సినిమాలు 1 మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరాయి.
ఈ వేసవి లో టాలీవుడ్ లో వచ్చిన అన్ని సినిమాలు డిజాస్టర్లు అవుతున్నాయి. ఈ టైంలో వేసవి లో వచ్చిన చిన్న చినుకు వానలా హిట్ 3 సినిమా నిలిచిందనే చెప్పాలి. కేవలం నాలుగు రోజుల్లోనే 70 నుంచి 80 శాతం రికవరీ అంటే మామూలు విషయం కాదు. హిట్ 3 సినిమా ను ఆంధ్రా లో రు. 15 కోట్లకు , సీడెడ్ లో 5.40 కోట్లకు , నైజాంలో రు. 12 కోట్లకు అమ్మారు. తొలి వారం ముగిసే సరికి జీఎస్టీతో కలిపి అందరూ బ్రేక్ ఈవెన్‌కు దగ్గరకు చేరుకుంటారు. రెండో వారం కూడా పెద్ద సినిమాల హడావిడి లేదు కనుక ... అంతో ఇంతో షేర్ వస్తుంది. ఖర్చులు కూడా గిట్టుబాటు అవుతాయి. ఇక కమీసన్ల సంగతి మాత్రం చూడాలి.