టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతో మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది మాత్రమే వారి నటన, అందచందాలతో మంచి గుర్తింపును సంపాదించుకుంటారు. అలాంటి వారిలో నటి రీతు ఒకరు. ఈ భామ జబర్దస్త్ షో ద్వారా తన కెరీర్ ప్రారంభించింది. ఆ షోలో అనేక టీమ్ లలో నటిస్తూనే మరోవైపు సినిమాలలోను అవకాశాలను దక్కించుకుంది. సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. ఇక సోషల్ మీడియాలో ఈ చిన్నదాని అందాల ఆరబోతకు అద్దు అదుపు ఉండదు. 

పొట్టి పొట్టి బట్టలు వేసుకుని తన అందాలను ఆరబోస్తూ హాట్ గా ఫోటోలు, వీడియోలు తన అభిమానులతో షేర్ చేసుకోగా అవి హాట్ టాపిక్ గా మారుతాయి. సోషల్ మీడియాలో తన అందాల ఆరబోతపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తారు. తాజాగా రీతు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో భాగంగా మాట్లాడుతూ కాస్టింగ్ కౌచ్ గురించి సంచలన కామెంట్లు చేసింది. సీరియల్స్ కోసం ఆడిషన్స్ కి వెళితే అక్కడ మేనేజర్ వచ్చి ఒక సీరియల్ హీరో చెప్పి ఆ హీరోతో నువ్వు అలా ఉంటేనే అవకాశం వస్తుందని అన్నాడు. నువ్వు ఆ హీరో వద్దకి ఎవరినీ తీసుకురావద్దు ఒక్కదానివే రావాలని చెప్పాడని రీతు తెలిపింది.

చిన్న వయసులోనే నన్ను అలా అడిగారు. సీరియల్ యాక్టర్స్ ఇలా ఉంటారా అని షాక్ అయ్యానని రీతు చెప్పింది. నా కెరీర్ మొదలయ్యాక ఆ ఫేమస్ సీరియల్ యాక్టర్ తోనే నటించానని ఆ సమయంలో అతడిని ఆ విషయం గురించి అడగాలని చాలా సందర్భాలలో అనుకున్నట్లుగా రీతు అన్నారు. కానీ ఎందుకో మొహమాటం అడ్డు వచ్చి అడగలేకపోయానని ఈ బ్యూటీ వెల్లడించింది. అయితే ఆ సీరియల్ హీరో పేరు మాత్రం రీతు చెప్పలేదు. ప్రస్తుతం కాస్టింగ్ కౌచ్ గురించి రీతూ చౌదరి చేసిన ఈ వాక్యాలు సంచలనంగా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: