తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్నారు. అందులో కొంతమంది మాత్రమే వారి నటనతో మంచి గుర్తింపు సంపాదించుకుంటారు. అలాంటి వారిలో నటి జెనీలియా ఒకరిని చెప్పవచ్చు. ఈ భామ తన నటన, అందంతో ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది. తన చలాకీతనం, చిన్నపిల్లల మనస్తత్వంతో ప్రతి ఒక్కరి చూపును తన వైపుకు తిట్టుకునేలా చేసింది. జెనీలియా తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి సక్సెస్ఫుల్ హీరోయిన్ గా తన కెరీర్  కొనసాగించింది. ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలలో హీరోయిన్ గా నటించి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. 


జెనీలియా తెలుగుతోపాటు హిందీలోనూ అనేక సినిమాలలో నటించి తనకంటూ స్పెషల్ గా ఫ్యాన్ బేస్ ఏర్పరచుకుంది. ఈ మధ్యకాలంలో తెలుగులో జెనీలియా ఎలాంటి సినిమాలను చేయడం లేదు. కేవలం హిందీలోనే నటిస్తూ సక్సెస్ఫుల్ హీరోయిన్ గా రాణిస్తోంది. సినిమాలపరంగా తన కెరీర్ మంచి పిక్స్ లో ఉన్న సమయంలోనే ప్రముఖ నటుడు, నిర్మాత, దర్శకుడు అయిన రితేష్ దేశ్ ముఖ్ ను వివాహం చేసుకుంది. వివాహం తర్వాత ఇద్దరు మగ పిల్లలకు జన్మనిచ్చింది. దీంతో జెనీలియా తన పూర్తి సమయాన్ని తన కుటుంబానికి కేటాయించింది. 

ఆ తర్వాత హిందీ సినిమాలలో తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఇదిలా ఉండగా... ప్రస్తుతం జెనీలియాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారింది. జెనీలియా తన భర్త రితేష్ ఇద్దరు కలిసి ఓ ఈవెంట్ కు హాజరయ్యారు. అక్కడ వారిద్దరూ కలిసి జంటగా ఫోటోలు తీసుకుంటున్న సమయంలో ఓ హీరోయిన్ వచ్చి తన భర్తను హగ్ చేసుకుంది. దీంతో పక్కనే ఉన్న జెనీలియా చాలా సీరియస్ గా ఓ లుక్ ఇచ్చింది. నా భర్తను హాగ్ చేసుకుంటావా అనే ఉద్దేశంతోనే జెనీలియా ఆ లుక్ ఇచ్చిందని ప్రతి ఒక్కరికి అర్థం అవుతోంది. ఆ తర్వాత జెనీలియా హీరోయిన్ కి స్ట్రాంగ్ గా వార్నింగ్ కూడా ఇచ్చినట్లుగా టాక్. ప్రస్తుతం వీరికి సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియా మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: