సారా టెండూల్కర్ ఈ భామ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. సచిన్ టెండూల్కర్ కూతురుగా సారా టెండూల్కర్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. తన అందం, అభినయంతో అభిమానుల మనసులను దోచుకుంది. సినిమాలలో నటించనప్పటికీ సారాకు విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో సారాకు విపరీతంగా అభిమానులు ఉన్నారు. తాను పోస్ట్ చేసే ఫోటోలకు విపరీతంగా లైక్స్ వస్తాయి. సారా టెండూల్కర్ తనకు నచ్చిన వెకేషన్ కి వెళితే అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. 

తన ఫ్రెండ్స్ తో ఎక్కువగా బయటకు వెళ్లి ఎంజాయ్ చేయడం లాంటివి చేస్తోంది. ఇదిలా ఉండగా..... సారా ఇంతవరకు ఎలాంటి సినిమాలలోను నటించలేదు. కానీ హీరోయిన్ కి సరిపోయే క్వాలిటీస్ అన్ని ఈ భామకు ఉన్నాయి. ఈ క్రమంలోనే సారాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారుతుంది. సారా టెండూల్కర్ త్వరలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనుందని బాలీవుడ్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. త్వరలోనే సారా హిందీ సినిమాలలో నటించాలని నిర్ణయం తీసుకుందట.

ఈ సినిమాకు ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ నిర్మాణంలో సారా టెండూల్కర్ సినిమా చేయనున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కథ కూడా సారా ఓకే చెప్పినట్టుగా టాక్. ఇందులో హీరో ఎవరు, ఏంటి అనే విషయాలు ఇప్పటివరకు వెలువడలేదు. ఇక త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలను ప్రారంభించాలని చిత్ర యూనిట్ సభ్యులు ఆలోచనలో ఉన్నారట.


త్వరలోనే ఈ సినిమా ప్రారంభం కాబోతోంది. ఈ సినిమా షూటింగ్ తొందర్లోనే ప్రారంభించి రిలీజ్ చేయాలని ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాను ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించాలని అనుకుంటున్నారట. ఇందులో ప్రముఖ బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ హీరోగా నటించే అవకాశాలు ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. ఈ విషయం పైన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: