మెగా హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ హీరో తనదైన నటనతో ప్రేక్షకుల మనసులను దోచుకున్నాడు. ఇప్పటివరకు తన కెరీర్ లో ఎన్నో బ్లాక్బస్టర్ హిట్ సినిమాలలో నటించి సక్సెస్ఫుల్ స్టార్ హీరోగా తన కెరీర్ కొనసాగిస్తున్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా మాత్రమే కాకుండా రాజకీయాల మీద ఉన్న ఆసక్తితో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ప్రజలకు తన వంతు సేవను చేస్తూ మంచి గుర్తింపు పొందుతున్నారు. 

ఎమ్మెల్యేగా మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా పదవి బాధ్యతలను చేపట్టారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఫుల్ బిజీ లైఫ్ షెడ్యూల్ ను కొనసాగిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా పదవి బాధ్యతలను చేపట్టకముందే ఒప్పుకున్న సినిమా ప్రాజెక్టులు పెండింగ్ లో అలానే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ కు సమయం దొరికినప్పుడల్లా సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. గత కొద్ది రోజుల క్రితం ఓ వారం రోజులపాటు షూటింగ్ ను శరవేగంగా కొనసాగించారు. ఈ క్రమంలోనే మళ్లీ పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్లో పాల్గొన్నట్లుగా సమాచారం అందుతుంది.

సుజిత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రం ''ఓజీ". ఇక ఈ సినిమా షూటింగ్ మళ్లీ ప్రారంభమైనట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు అనౌన్స్ చేశారు. ఈ మేరకు సినిమాకు సంబంధించిన ఓ ఫోటోను షేర్ చేస్తూ "మళ్ళీ మొదలైంది.... ఈసారి ముగిద్దాం" అని క్యాప్షన్ జత చేశారు. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో నటిస్తున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ముగియనుంది. త్వరలోనే ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ సభ్యులు ప్లాన్ లో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: