తెలుగు సినీ ఇండస్ట్రీలో అమ్మ పాత్రలకు చాలా ప్రత్యేకమైన స్థానం ఉన్నది. అలా మదర్ సెంటిమెంటుతో హిట్ అయిన సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. అయితే 1950 నాటి సినిమాలు 2025లో కనిపించడం లేదు ముఖ్యంగా అమ్మ పాత్రలు అప్పటినుంచి ఇప్పటివరకు మారుతూనే ఉన్నాయి. ఒకప్పుడు మదర్ పాత్రలు భర్త మీద ఆధారపడేవి, సెంటిమెంట్స్ , దొంగ బంధాలను గుర్తించగలిగే , ఒంటరిగా జీవనాన్ని సాగించే పాత్రలలో మదర్ సెంటిమెంట్. వంటి పాత్రలలో ఉండేవి


1985-2000 :
జానపద చిత్రాలలో చిత్రాలు ఉండేవి అందులో హీరో ఏదో ఒక సాహసం చేస్తూ ఉంటారు..తన బిడ్డలకు కష్టాలు రాకుండా తల్లి కూడా ప్రార్థనలు చేస్తూ ఉండే పాత్రలో నటిస్తూ ఉండేది.. లేకపోతే భర్తకు, కొడుకుకు మధ్య గొడవలతో నలిగిపోతూ ఉండే పాత్రలో నటిస్తుంది వారు. అలాంటి పాత్రలలో ఎక్కువగా అన్నపూర్ణమ నటించింది. ఇక ఈమె కాకుండా శారద, జయసుధ, వాణిశ్రీ వంటి వారు కూడా ఎక్కువగా అమ్మ పాత్రలలో నటించారు.


1960కు ముందు సినిమా అంటే కేవలం భర్త చాటు భార్యగా ,పిల్లల్ని పెంచే తల్లిగా , కోడల్ని వేధించే అత్తగా ఉండేవారు.. ఇక ఆ తర్వాత చాలా మార్పులు వచ్చి వ్యవసాయం, నిరుద్యోగంతో పాటు ఉమ్మడి కుటుంబాల విచ్ఛిన్నం వంటి పాత్రలలో కూడా నటించారు.

ముఖ్యంగా కొడుకులు కళ్ళముందే విడిపోతూ ఉంటే తల్లి ఎంత వేదన పడుతుందో అనే పాత్రలలో నటించారు. అలాగే ఆస్తులతో పాటుగా తల్లితండ్రి ని కూడా పంచుకునేవారు.


1960 తర్వాత.. ఆకలి పేదరికంతో అలమటించే తల్లి పాత్రలు ఎక్కువగా వచ్చాయి. మనుషులు మారాలి అనే చిత్రంలో శారద నటించిన తల్లి పాత్ర ఆమెకు మరింత పేరు తీసుకు వచ్చింది.



1993లో వచ్చిన మాతృదేవోభవ సినిమా.. పిల్లల్ని చంపకుండా తాను చనిపోతానని తెలిసి తన పిల్లల్ని కూడా దత్తకు విచ్చేస్తుంది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది ఇందులో మాధవి అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది.


ఇక ఇప్పటి అమ్మ పాత్రలు ముసలమ్మ పాత్రలు కాకుండా గ్లామర్ గా చలాకీగా ఉండే పాత్రలలో నటిస్తూ ఉన్నారు. అలా బొమ్మరిల్లు సినిమాల క్లైమాక్స్లో అదరగొట్టేసిన జయసుధ ఇప్పటికీ కూడా గుర్తుండి పోయేలా నటించింది. అలాగే అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి చిత్రంలో కూడా సింగిల్ మదర్ గా అందరి చేత ప్రశంసలు అందుకునేలా నటించింది.


ఇక కేజిఎఫ్ ,సలార్ వంటి చిత్రాలు అవసరమైతే కొడుకుని హింసకి ప్రేరేపించే తల్లుల పాత్రలో కూడా నటించారు. ముఖ్యంగా యంగ్ గా ఉండేవారే తల్లుల పాత్రలో నటిస్తూ ఉన్నారు.మహిళలు ఎప్పుడైతే స్వయం సమృద్ధి సాధించారో ఎప్పుడైతే సొంత కాలం మీద నిలబడ్డారో ఆ సమయంలోనే సినిమా కథలు కూడా పూర్తిగా మారిపోయాయి.


ఇక రమ్యకృష్ణ, నదియా వంటి వారు కూడా అద్భుతమైన పాత్రలలో నటిస్తూ ఉన్నారు. బాహుబలి చిత్రంలో రమ్యకృష్ణ తల్లిపాత్రలో అద్భుతమైన నటనను కనబరిచింది. ఇక నదియా కూడా అత్తారింటికి దారేది, తదితర చిత్రాలలో కూడా నటించి అద్భుతమైన నటనను కనబరిచింది. ఇలా వీరిని చూసుకొని చాలామంది నటిస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: