నటి అంజలి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ భామ తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలలో హీరోయిన్ గా నటించి ప్రేక్షకుల ప్రశంసలు పొందింది. ప్రస్తుతం ఈ భామ తెలుగుతో పాటు తమిళం సినిమాలలో కూడా నటిస్తోంది. రీసెంట్ గానే తెలుగులో అంజలి "గేమ్ చేంజర్" సినిమాలో నటించింది. ఇందులో రామ్ చరణ్ హీరోగా నటించారు. అంజలి "గేమ్ చేంజర్" సినిమాలో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాలో అంజలి నటనకు మంచి మార్కులే పడ్డాయి. తన నటనకు గాను ఎన్నో ప్రశంసలను పొందింది. 

ప్రస్తుతం అంజలి పలు సినిమా ప్రాజెక్టులతో బిజీగా ఉంది. వరుస సినిమా షూటింగ్ లలో బిజీగా గడుపుతోంది. అంజలి వయసు పెరిగినప్పటికీ ఏమాత్రం తరగతి అందం, ఫిట్నెస్ కొనసాగిస్తోంది. అంజలి వయసు 40కి పైనే ఉన్నప్పటికీ ఈ భామ ఇంతవరకు వివాహం చేసుకోకుండా సింగిల్ గానే ఉంటుంది. కానీ అంజలి పెళ్లి అయిన ఓ స్టార్ హీరోతో ఎఫైర్ పెట్టుకుందని అనేక రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. పెళ్లయి పిల్లలు ఉన్న హీరోతో అంజలి సీక్రెట్ గా రిలేషన్ కొనసాగిస్తుందట  అంతేకాకుండా త్వరలోనే వీరిద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంటున్నారట. ఈ విషయాన్ని అంజలి తన కుటుంబ సభ్యులకు చెప్పగా వారు ఒప్పుకోవడం లేదట.

ఈ విషయాన్ని అంజలి సన్నిహితులు బయటపెట్టారు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ అంజలికి సంబంధించి ఈ వార్త హాట్ టాపిక్ గా మారుతుంది. ఈ వార్తలపై అంజలి ఎలా స్పందిస్తుందో చూడాలి. ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సింది. ఈ విషయం తెలిసిన అంజలి అభిమానులు పెళ్లయిన అబ్బాయి నీకు వివాహం చేసుకోవడం అవసరమా... అది కూడా పిల్లలు ఉన్న వ్యక్తిని చేసుకోవడం ఏంటి. ఆ హీరో పిల్లలు, భార్య ఏమైపోవాలి. వారి లైఫ్ ఏమైపోవాలి అని ప్రశ్నిస్తున్నారు. దీనిపైన అంజలి ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: