- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అలాగే టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ క‌ల‌యిక‌లో వచ్చిన భారీ మల్టీస్టారర్ సినిమా రౌద్రం రణం రుధిరం. త్రిబుల్ ఆర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటికి మూడేళ్లు అవుతున్నా కూడా ఇప్పటికీ వరల్డ్ వైడ్ గా ఈ సినిమా మానియా వినిపిస్తోంది. దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెర‌కెక్కించిన ఈ సినిమా గ్లోబల్ ట్రెండ్ సెట్‌ చేసిన సినిమా గా నిలిచింది. అయితే కొంత కాలం నుంచి ఈ భారీ సినిమా కు సీక్వెల్‌ ఉంటుంది అనే చర్చ కూడా కొనసాగుతూ వచ్చింది. కొద్దిరోజుల క్రితం రాజమౌళి పై వచ్చిన ఓటీటీ డాక్యుమెంటరీ సినిమా చివర్లో కూడా త్రిబుల్ ఆర్ సినిమా పార్ట్ 2 కోసం చర్చ జరిగింది.


అయితే ఇప్పుడు ఫైనల్ గా దీనిని జక్కన్న కన్ఫామ్ చేసేసారు. రాంచరణ్ షేర్ చేసిన లేటెస్ట్ వీడియోలో రాజమౌళికి ఎదురైన త్రిబుల్ ఆర్ పార్ట్ 2 ప్రశ్నకి జక్కన్న ఉంది అని ఆన్సర్ ఇవ్వటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ ఆన్స‌ర్‌తో ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్ అభిమానులు షేక్ అవుతుంటే.. తెలుగు సినీ జ‌నాలు అయితే ఆనందంతో షాక్ లోకి వెళ్లిపోయారు. గ్లోబల్ ఆడియన్స్ ఎంతగానో సెలబ్రేట్ చేసుకున్న ఈ ఇండియన్ సినిమాకి సీక్వెల్‌ ఎప్పుడు ? మొదలు పెడతారో చూడాలి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: