
అలాగే జూన్ 10 నుంచి గోపీచంద్ మలినేని సినిమా మొదలుపెట్టనున్నారు బాలయ్య .. అయితే వీటి మధ్యలో జైలర్ 2 కూడా అడుగు పెట్టబోతున్నట్టు తెలుస్తుంది .. రీసెంట్ గానే కూలీ షూటింగ్ పూర్తి చేసిన రజినీకాంత్ .. అప్పుడే జైలర్ 2 ను మొదలు పెట్టేసారు ..అలాగే ఈ సినిమాను 2026 సమ్మర్ కు రిలీజ్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు .. జైలర్ 1న్ లో నటించిన శివరాజ్ కుమార్ , మోహన్‌లాల్ సీక్వల్ లో కూడా భాగం కాబోతున్నారు .. వీరితో అడిషనల్ గా బాలయ్య కూడా ఈసారి స్క్రీన్ పంచుకోవడానికి వచ్చేస్తున్నారు .
అయితే జైలర్ 2 లో బాలయ్య పాత్ర దాదాపు 40 నిమిషాలు ఉంటుందని కూడా తెలుస్తుంది .. అలాగే ఈ సినిమా కోసం దాదాపు 20 రోజుల డేట్స్ ఇచ్చారట .. దీనికోసం 50 కోట్ల పారితోషకం అందుకోబోతున్నట్లు ప్రచారం కూడా జరుగుతుంది . ఇక వచ్చే జూన్ నుంచి జైలర్ 2కు డేట్స్ ఇచ్చారు బాలయ్య .. మొదటి భాగంలోనే రజినీకాంత్ , బాలయ్య కాంబో మిస్సయింది .. ఈసారి మాత్రం మిస్ అయ్యే అవకాశం లేదు .. సినిమా బ్లాక్ బస్టర్ అంటున్నాడు నెల్సన్ ..ఇక మరి చూడాలి ఈ కాంబో ఎలా ఉండబోతుంది అనేది ..