తెలుగు సినీ పరిశ్రమలో ఎంతోమంది యాంకర్లు ఉన్నారు. అందులో కొంతమంది మాత్రమే సక్సెస్ఫుల్ యాంకర్లుగా వారి కెరియర్ కొనసాగిస్తారు. అలాంటి వారిలో రష్మీ గౌతమ్ ఒకరు. ఈ భామ మొదట సినిమాలలో నటించి మంచి గుర్తింపు అందుకుంది. సినిమాలలో పలు కీలక పాత్రలను పోషించిన రష్మి గౌతమ్ అనంతరం యాంకరింగ్ మీద ఉన్న ఇష్టంతో జబర్దస్త్ షో ద్వారా యాంకర్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ షోలో తనదైన యాంకరింగ్ స్టైల్ తో అభిమానులను ఆకట్టుకుంది. తన చలాకీతనం, క్యూట్ ఎక్స్ప్రెషన్స్, మాటలతో వివిధ షోలలో యాంకర్ గా చేసే అవకాశాలను కైవసం చేసుకుంది. 

ఓవైపు యాంకర్ గా రాణిస్తూనే మరోవైపు పలు వెబ్ సిరీస్ లలోను నటించింది. అంతేకాకుండా సినిమాలలో కూడా అవకాశాలను అందుకుంది. కొన్ని సినిమాలలో హీరోయిన్ గా కూడా నటించి ప్రేక్షకులను మెప్పించింది. కానీ పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయింది. ఈ మధ్యకాలంలో రష్మీ ఫుల్ బిజీ యాంకర్ గా, ఆర్టిస్ట్ గా మారిపోయింది. రష్మి గౌతమ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకోగా అవి క్షణాల్లోనే వైరల్ అవుతాయి.

రష్మీకి విపరీతంగా అభిమానులు, అభిమాన సంఘాలు ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా రష్మి గౌతమ్ ప్రముఖ నటుడు సుధీర్ తో ఎఫైర్ వార్తల కారణంగా ఫేమస్ అయ్యారు. ఇదిలా ఉండగా.... ప్రస్తుతం రష్మి గౌతమ్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. రష్మీ తాజాగా తన ఫ్రెండ్స్ తో కలిసి వెకేషన్ కి వెళ్లారు. అక్కడ వెకేషన్ లో తన స్నేహితులతో కలిసి ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. దానికి సంబంధించిన ఫోటోలను రష్మి గౌతమ్ తన అభిమానులతో షేర్ చేసుకున్నారు.

అందులో కొన్ని ఫోటోలలో రష్మి గౌతమ్ తన అభిమానులకు ముద్దులు పెడుతున్నటువంటి కొన్ని ఫోటోలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఈ ఫోటోలు చూసి కొంతమంది నెటిజన్లు సీరియస్ అవుతున్నారు. ఇలా పబ్లిక్ గా ముద్దులు పెడుతున్నట్లు ఫోటోలు దిగి షేర్ చేయడం అవసరమా అని ట్రోల్ చేస్తున్నారు. మరికొంతమంది అభిమానులు చాలా అందంగా ఉన్నావని పొగడ్తలతో ముంచేత్తుతున్నారు. వీటిపై రష్మీ గౌతమ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: