సచిన్ టెండూల్కర్ కూతురుగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును అందుకుంది సారా టెండూల్కర్. ఈ భామ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. హీరోయిన్ కి మించిన అందం, అభినయంతో ఉంటుంది. సారా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా పంచుకుంటుంది. తనకు సమయం దొరికినప్పుడల్లా వారితో ముచ్చటిస్తూ ఉంటుంది. వరుసగా ఫోటోషూట్లు చేస్తూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసుకోగా అవి హాట్ టాపిక్ గా మారుతాయి. 


సారాకు సోషల్ మీడియాలో విపరీతంగా అభిమానులు ఉన్నారు. తాను పోస్ట్ చేసే ఫోటోలు క్షణాల్లోనే వైరల్ గా మారుతాయి. ఇదిలా ఉండగా.... గత కొద్ది రోజులు నుంచి సారా టెండూల్కర్ ప్రముఖ క్రికెటర్ గిల్ తో ప్రేమలో ఉన్నారని అనేక రకాల వార్తలు వైరల్ అయ్యాయి. వీరిద్దరూ కలిసి చాలా సందర్భాలలో బయట పార్టీలకు, పబ్బులకు కూడా వెళ్లారు. ఆ తర్వాత కొద్ది రోజులకు ఏమైందో తెలియదు కొన్ని రోజుల నుంచి వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నట్లుగా అనేక రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా... సారా టెండూల్కర్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో భాగంగా మాట్లాడుతూ తనకు సంబంధించిన అన్ని విషయాలను చెప్పుకుంది.

తనకు గతంలో పిసిఓఎస్ సమస్యతో పోరాటం చేశానని సారా వెల్లడించింది. వయసు పెరిగిన కొద్దీ తనకు హార్మోన్ల కారణంగా ముఖంపై చాలా మొటిమలు వచ్చేవని చెప్పింది. అవి పీసీఓఎస్ వల్ల రావడం వలన చాలా ఇబ్బందులు పడ్డారని వెల్లడించింది. తనకు ఏడవ తరగతి ఉన్న సమయంలోనే ముఖంపై మొటిమలు రావడం ప్రారంభం అయ్యాయట. కానీ వాటి గురించి పెద్దగా తెలియకపోవడంతో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదని సారా చెప్పింది.

ఆ సమస్య కారణంగా ముఖంపై మొటిమలు, చర్మం నల్లగా మారడం, జిడ్డుగా తయారవ్వడం, బరువు విపరీతంగా పెరగడం లాంటి సమస్యలు ఎదుర్కొందట. ఈ విషయం స్వయంగా సారా టెండూల్కర్ వెల్లడించారు. ప్రస్తుతం సారా షేర్ చేసుకున్న ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తనకు పిసిఒఎస్ సమస్య వచ్చిన కారణంగానే సారాకు గిల్ బ్రేకప్ చెప్పారని అనేక రకాల వార్తలు వైరల్ అవుతాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: