ఖయాదు లోహర్ ఈ బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. డ్రాగన్ సినిమాతో ఒక్కసారిగా ఈ భామ క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. ఖయాదూ లోహార్ మోడల్ గా తన కెరీర్ ప్రారంభించింది. అనంతరం సినిమాల మీద ఆసక్తితో చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చింది. తన నటన, అందంతో విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఈ భామ అస్సాంలోని తేజ్పూర్ లో జన్మించింది. ప్రస్తుతం పూణేలో నివాసం ఉంటోంది. గతంలో ఖయాదు లోహర్ అనేక సినిమాలలో నటించినప్పటికీ రీసెంట్ గా వచ్చిన డ్రాగన్ సినిమాతో పాపులారిటీ సంపాదించుకుంది. ఆ సినిమా అనంతరం వరుసగా సినిమా అవకాశాలను అందుకుంటున్న సమయంలో ఖయాదూ లోహర్ వివాదంలో చిక్కుకుంది.

 టాస్మాక్ స్కామ్ తో సంబంధం ఉన్న నిందితులు ఏర్పాటు చేసుకున్న నైట్ పార్టీలో ఖయాదు పాల్గొంది. ఈ వార్త కోలీవుడ్ సర్కిల్స్ లో తెగ వైరల్ అవుతుంది. ఖయాదూ లోహార్ పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఆరోపణలు కోలీవుడ్ సర్కిల్ లో వైరల్ గా మారుతున్నాయి. తమిళనాడు రాష్ట్ర మద్యం సంస్థతో సంబంధాలు కలిగి ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. ED దాడుల సమయంలో ఖయాదూ లోహార్ ఈ స్కామ్ తో సంబంధాలు ఉన్న వ్యక్తులతో కలిసి ఉన్నట్లుగా వెళ్లడైంది. అంతేకాదు ఈ బ్యూటీ స్కామ్ తో సంబంధం ఉన్న వ్యక్తులు నిర్వహించిన నైట్ పార్టీలకు కూడా వెళ్లిందని వెళ్లడైంది. ఒక్కో పార్టీకి ఈ భామా దాదాపు రూ. 35 లక్షల రూపాయలు వసూలు చేసినట్టుగా సమాచారం అందుతుంది.

 ఈ విషయం ఈడి అధికారుల దర్యాప్తులో తాజాగా వెలుగులోకి వచ్చింది. కోలీవుడ్, టాలీవుడ్ లోనూ ఈ స్కామ్ రాష్ట్రంలో కలకలం సృష్టిస్తోంది. ఇందులో రాజకీయ నాయకులు, డిస్టేల్లరీ ఓనర్లు, ప్రభుత్వ అధికారులు ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. ఈ విషయం పైన పెద్ద ఎత్తున చర్చలు కొనసాగుతున్నాయి. అయితే దీనిపై ఇంకా పూర్తిగా క్లారిటీ రాలేదు. ప్రస్తుతం ఈడి అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ భామ రీసెంట్ గానే డ్రాగన్ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడిప్పుడే ఫుల్ ఫామ్ లోకి వస్తున్న సమయంలో ఖయాదు ఇలా చేయడంతో తన అభిమానులు సీరియస్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: