అక్కినేని కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అక్కినేని నాగేశ్వరరావు నుంచి అక్కినేని నాగార్జున, అఖిల్, నాగచైతన్య ఇలా చాలామంది చిత్ర పరిశ్రమకు హీరోలుగా పరిచయమై ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటున్నారు. ఎన్నో సినిమాలలో నటించి అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ఇక అక్కినేని కుటుంబానికి సంబంధించిన ఎన్ కన్వెన్షన్ ను గత కొద్ది రోజుల క్రితం రేవంత్ రెడ్డి సర్కార్ కూల్చేసిన సంగతి తెలిసిందే. ఓ చిన్న తప్పు కారణంగా హైడ్రా అధికారులు అక్కినేని నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ ను పూర్తిగా నేలమట్టం చేశారు. అయినప్పటికీ రేవంత్ రెడ్డి సర్కార్ దీనిపై పెద్దగా స్పందించలేదు. 

మరోవైపు దేవాదాయ శాఖ అధికారి కొండా సురేఖ ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత, నాగచైతన్య, అక్కినేని నాగార్జునపై అసభ్యకరంగా మాట్లాడారు. తాను మాట్లాడిన మాటలపై రెండు తెలుగు రాష్ట్రాలు విపరీతంగా మండిపడ్డారు. అయినప్పటికీ ఈ విషయం పైన కూడా రేవంత్ రెడ్డి స్పందించలేదు. ఈ క్రమంలోనే తాజాగా అక్కినేని నాగ చైతన్య షోయు పేరుతో ఓ క్లౌడ్ కిచెన్ ను నిర్వహిస్తున్నారు. ఈ రెస్టారెంట్ కు విపరీతంగా జనాలు ఆహారం కోసం ఎగబడతారు. ఈ క్రమంలోనే ఈ రెస్టారెంట్ లో ఫుడ్ ఆర్డర్ చేసిన ఆహారంలో బోద్ధింక వచ్చినట్లుగా ఓ వ్యక్తి ఎక్స్ లో ఫిర్యాదు చేశారు. మొత్తం షోయు రెస్టారెంట్ నుంచి 5000 విలువ చేసే ఆహారాన్ని బుక్ చేశానని చెప్పాడు. 

బోద్ధింక గురించి స్విగ్గిలో కంప్లైంట్ చేస్తే కేవలం రూ. 500 రిఫండ్ చేశారని తెలియజేశాడు. ఇంత పెద్ద సంస్థలు సైతం శుభ్రతను పాటించకపోతే ఎలా ఉంటుందని నెటిజన్లు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం పైన రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఫుడ్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తారు. మరి రేవంత్ రెడ్డి ఈ విషయం పైన ఎలా స్పందిస్తారోనని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అక్కినేని కుటుంబంపై అనేక రకాల ఆరోపణలు వస్తున్నప్పటికీ రేవంత్ రెడ్డి ఇప్పటివరకు స్పందించడం లేదు. అక్కినేని కుటుంబంపై రేవంత్ రెడ్డి ఏదో పగతోనే ఇలా చేస్తున్నాడని అక్కినేని అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఈ విషయంపైన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: