- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమాలలో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో చేస్తున్న భారీ సినిమా స్పిరిట్ కూడా ఉంది. అయితే ఈ సినిమా విషయంలో పలు ఇంట్రెస్టింగ్ అంశాలు ఇప్పుడు సినీ వర్గాలలో చక్కెరలు కొడుతున్నాయి. బాలీవుడ్ స్టార్ అయిన దీపికా పదుకొనే ఈ సినిమా నుంచి వైదొలిగింది అన్న ప్రచారం బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఆమె ప్లేస్ లో మరో కొత్త హీరోయిన్ లాక్ అయినట్టు ప్రచారం మొదలైంది. అయితే ఈసారి ప్రభాస్ కి జోడిగా కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ పేరు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ లాక్ చేసినట్టు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.


ఒకవేళ ఇది నిజమైతే ఒక ఊహించని కాంబినేషన్ అని చెప్పాలి. ఈ సినిమాకు హర్షవర్ధన్ రామేశ్వర సంగీతం అందిస్తుండగా టి సిరీస్ - భద్రకాళి ఫిలింస్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భ‌ద్రకాళి ఫిలింస్ ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగ సొంత బ్యాన‌ర్ అన్న సంగ‌తి తెలిసిందే. ఇక స్పిరిట్ నుంచి దీపికా ప‌దుకొనే ను తొల‌గించ‌డానికి కార‌ణం ఆమె ద‌ర్శ‌కుడి ముందు ప‌లు కండీష‌న్లు పెట్ట‌డ‌మే అంటున్నారు. అలాగే ప్రభాస్ నటిస్తున్న ది రాజా సాబ్ - సలార్ టు - కల్కి టు సినిమాలు కూడా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ల‌ను న్నాయి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: