ఆ తర్వాత బాలీవుడ్ లో వరస చిత్రాలతో బిజీ అయింది. తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో తెరకెక్కనున్న యాక్షన్ థ్రిల్లర్ `స్పిరిట్` లో హీరోయిన్ గా ఎంపిక కావడంతో ఇప్పుడు త్రిప్తి మరింత ట్రెండ్ అవుతోంది. ఏకంగా ప్రభాస్ తో రొమాన్స్ చేసే బంపర్ ఆఫర్ దక్కడంతో త్రిప్తికి సంబంధించి అనేక విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే త్రిప్తి ఆస్తుల వివరాలు తెరపైకి వచ్చాయి.
త్రిప్తి డిమ్రీకి ముంబైలోని బాంద్రా ఏరియాలో ఓ లగ్జరీ అపార్ట్‌మెంట్ ఉంది. షారూఖ్ ఖాన్, రణబీర్ కపూర్ లాంటి అగ్ర కథానాయకుల ఇళ్లకు సమీపంలోనే త్రిప్తి అపార్ట్‌మెంట్ ఉంటుంది. దీని విలువ రూ. 14 కోట్ల వరకు ఉంటుందని అంటున్నారు. అలాగే ప్రస్తుతం త్రిప్తి ఓ సినిమాకు రూ. 4 నుండి 6 కోట్ల రేంజ్‌లో రెమ్యునరేషన్ అందుకుంటోంది. మరోవైపు వెబ్ సిరీస్‌లు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ ద్వారా కూడా భారీగా సంపాదిస్తోంది. పలు నివేదిక ప్రకారం.. త్రిప్తి ఆస్తుల విలువ దాదాపుగా రూ. 30 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. ఇక ఈ విషయం తెలిశాక నెటిజన్లకు ఫ్యూజులు అవుట్ అవుతున్నాయి. ఆస్తులు కూడబెట్టడంతో త్రిప్తి హీరోలను సైతం డామినేట్ చేస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి