పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కిన హరిహర వీరమల్లు సినిమా సుదీర్ఘ కాలం షూటింగ్ జరుపుకున్న సినిమాలలో ఒకటనే సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలకు మరో 15 రోజుల సమయం మాత్రమే ఉంది. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. బాలీవుడ్ కీలక నటులు సైతం ఈ సినిమాలో భాగం అయిన సంగతి తెలిసిందే.
 
ఈ సినిమాలోని 80 శాతం సన్నివేశాలకు క్రిష్ దర్శకత్వం వహించగా 20 శాతం సన్నివేశాలకు జ్యోతికృష్ణ్ దర్శకత్వం వహించారు. అయితే మొదట అనుకున్న కథ మారిందని ఈ సినిమాలో సనాతన ధర్మం గురించి ప్రధానంగా ప్రస్తావించనున్నారని భోగట్టా. జ్యోతికృష్ణ ఎంట్రీతో పవన్ సూచనల మేరకు కథ మారిందని తెలుస్తోంది. హరిహర వీరమల్లు సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించారు.
 
హరిహర వీరమల్లు రెండు భాగాలుగా తెరకెక్కుతున్న నేపథ్యంలో రెండొ భాగం షూటింగ్ మొదలవుతుందా అనే ప్రశ్న సైతం వ్యక్తమవుతోంది. పవన్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉండటంతో సినిమాల ఎంపికలో, పాత్రల ఎంపికలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. హరిహర వీరమల్లు సినిమాకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరిగిందని సమాచారం అందుతోంది. హరిహర వీరమల్లు సినిమా ఏ రేంజ్ లో సంచలనాలు సృష్టిస్తోంది.
 
పవన్ కళ్యాణ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉండగా ఈ ఏడాదే పవన్ రెండు సినిమాలు విడుదల కానున్నాయి. పవన్ కళ్యాణ్ పారితోషికం సైతం భారీ స్థాయిలో ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భారీ ప్రాజెక్ట్ లతో సరికొత్త రికార్డులను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. పవన్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లతో సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ కామెంట్లు వ్యకమవుతున్నాయి.  హరిహర వీరమల్లు మూవీ నైజాం హక్కులకు ఒకింత భారీ స్థాయిలో డిమాండ్ నెలకొన్న సంగతి తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: