
నిజానికి ఎక్కడ కూడా పూరి జగన్నాథ్ థియేటర్స్ విషయం గురించి స్పందించలేదు . కానీ కొంతమంది పూరీ జగన్నాథ్ మాట్లాడిన మాటలను థియేటర్స్ ఇష్యూ కి లింక్ పెడుతూ ట్రోల్ చేస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ బాగా వైరల్ గా మారింది . మనకు తెలిసిందే " పూరి జగన్నాథ్ పూరి మ్యూజింగ్స్ లో భాగంగా టినీ లివింగ్ థింగ్స్ అనే అంశంపై మాట్లాడుతూ వస్తున్నారు. ఇదే మూమెంట్లో ఆయన ఆరోగ్యం.. జీవనశైలి పై మాట్లాడిన మాటలు పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. మరీ ముఖ్యంగా పూరి జగన్నాధ్ మ్యూజింగ్స్ లో "మన కంటికి కనిపించిన సూక్ష్మజీవుల" గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు .
"మానవ శరీరం మిలియన్ల కొద్ది చిన్న జీవరాసుల కి నిలయం ..ఇవి మనతోనే మనపైనే జీవిస్తాయి ...మరి ఈ ముఖ్యంగా ముక్కు.. నోరు.. కళ్ళు.. చర్మం ..జుట్టు ఎక్కడపడితే అక్కడ ఉంటాయి . ఇలా ఇవి మన కుటుంబ సభ్యులనే అనుకోవాలి సుమారు 100 ట్రిలియన్ మైక్రోప్స్ మనలో ఉంటాయి. వాటి బరువు దాదాపు రెండు కిలోలు ఉంటుందని పూరి జగన్నాథ్ పేర్కొన్నారు". అంతే కాదు పట్టణాలలో నివసించే వారిలో పెరుగుతున్న అతి శుభ్రత అలవాట్లు ఈ సూక్ష్మజీవులను దూరం చేస్తున్నాయి అని ..పూరి జగన్నాథ్ ఆందోళన వ్యక్తం చేశారు . పదేపదే చేతులను సబ్బుతో కడుగుతూ ఉండడం ..సానిటైజర్లు వాడడం డిస్టిల్డ్ వాటర్ తాగడం వల్ల ఈ మైక్రోబ్స్ ను చంపేస్తున్నాయ్ అని .. దీనివల్ల వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది అని .. పల్లెటూర్లో నివసించే వారు ప్రకృతి అందాలతో జంతువులతో కలిసిమెలిసి జీవించడం వల్ల ఈ మైక్రోబ్ సహజంగా స్ట్రాంగ్ గా మారిపోతున్నాయి అని ఆయన అభిప్రాయపడ్డారు .
"ఎక్కడ నీళ్లు అక్కడే తాగండి.. ఎక్కడ గాలి అక్కడే పిలిచండి ..ఎక్కడున్న తిండి అక్కడే తినండి . అతి శుభ్రత ఏ విషయంలో పనికిరాదు . మీ పిల్లలను మట్టిలో ఆడనివ్వండి.. వర్షంలో తడవనివ్వండి.. ప్రకృతికి దూరంగా బతకదు.. అలా చేస్తే చస్తారు "అంటూ పూరి జగన్నాధ్ కూసింత ఘాటుగా హెచ్చరించారు . అయితే ఆయన మాట్లాడిన మాటలు ఇన్ డైరెక్ట్ గా థియేటర్స్ ఇష్యూస్ కి కనెక్ట్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు. " మీరు మీలా ఉండండి హద్దులు మీరితే చస్తారు పవన్ కళ్యాణ్ తో ఆటలు ఆడితే చస్తారు" అంటూ ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు..!