
మరోవైపు ఈ సినిమా రీరిలీజ్ తో థియేటర్లు ఒకింత కళకళలాడుతున్నాయని చెప్పాలి. ఖలేజా సినిమా రీరిలీజ్ డే1 కలెక్షన్లు భారీ స్థాయిలో ఉండే ఛాన్స్ ఉంది. గతంలో ఎన్నో సినిమాలు క్రియేట్ చేసిన డే1 కలెక్షన్ల రికార్డ్ లను ఈ సినిమా బ్రేక్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఖలేజా సినిమా రీరిలీజ్ వెర్షన్ కు ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వస్తుండటం సంచలనం అవుతోంది.
ఖలేజా మూవీలో దిలావర్ సింగ్ వైఫ్ పాత్రలో నటించిన నటికి సైతం ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ దక్కుతోంది. ఆమెకు ఈ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని తెలిసి నెటిజన్లు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఖలేజా సినిమాలో ట్విస్టులు సైతం ఒకింత ఆసక్తికరంగా ఉండటంతో అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతోంది. కొన్ని సీన్లను కట్ చేయడం ఫ్యాన్స్ ను బాధ పెడుతోంది.
ఖలేజా సినిమా ఫుల్ రన్ లో 10 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సొంతం చేసుకుంటుందేమో చూడాల్సి ఉంది. ఖలేజా సినిమా నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కినా సినిమా రిలీజ్ సమయంలో సరైన విధంగా ప్రమోషన్స్ చేయకపోవడం కూడా ఈ సినిమాకు మైనస్ అయిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఖలేజా సినిమా టాలీవుడ్ రేంజ్ ను పెంచిన సినిమాల్లో ఒకటని చెప్పవచ్చు. ఖలేజా సినిమాలో సాంగ్స్ సైతం అంచనాలకు మించి హిట్ అయ్యాయనే సంగతి తెలిసిందే. ఖలేజా సినిమా డైరెక్ట్ రిలీజ్ సినిమాలకు గట్టి పోటీ ఇస్తోంది.