నందమూరి నట సింహం బాలకృష్ణ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు . బాలయ్య ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించి , ఎన్నో అద్భుతమైన విజయాలను సొంతం చేసుకున్నాడు. కొంత కాలం క్రితం బాలయ్ డాకు మహారాజ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం బాలకృష్ణ , బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన అఖండ మూవీ లో హీరో గా నటించి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ప్రస్తుతం బాలకృష్ణ , బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న అఖండ 2 అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు.

ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో అనేక సినిమాలు రీ రిలీజ్ అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా బాలకృష్ణ నటించిన కొన్ని సినిమాలు కూడా ఇప్పటికే రీ రిలీజ్ అయ్యాయి. ఇకపోతే బాలకృష్ణ నటించిన మరో సినిమా కూడా రీ రిలీజ్ కావడానికి రెడీ అయింది. తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా విడుదల అయింది. బాలకృష్ణ కొన్ని సంవత్సరాల క్రితం లక్ష్మీనరసింహ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో ఆసిన్ హీరోయిన్గా నటించింది. 

మూవీ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాను బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా జూన్ 7 వ తేదీన రీ రిలీజ్ చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటించారు. ఈ మధ్య కాలంలో రీ రిలీజ్ అయిన చాలా సినిమాలకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. మరి లక్ష్మీనరసింహ సినిమాకు రీ రిలీజ్ లో భాగంగా ప్రేక్షకుల నుండి ఏ స్థాయి రెస్పాన్స్ లభిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: