- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

మే నెల టాలీవుడ్ బాక్సాఫీస్ రిజల్ట్ చూశాం. ఇప్పుడు జూన్లోకి వచ్చేసాం.. జూన్ నెల బాక్సాఫీస్ చాలా క్రేజీగా ఉంది. ఒక పెద్ద సినిమా వచ్చినప్పుడు ? ముందు లేదా వారం గ్యాప్ కనిపిస్తుంది. కానీ జూన్ లో మాత్రం వారానికి పెద్ద సినిమా వస్తోంది. జూన్ 5న థ‌గ్ లైఫ్ వస్తోంది. కమలహాసన్ - శింబు హీరోలు. పైగా దశాబ్దాల తర్వాత కమల్ - మణిరత్నం కలిసి చేసిన సినిమా ఇది. అందుకే ఈ సినిమాపై తమిళంలోనే కాదు తెలుగులో మంచి బజ్‌ ఉంది. ఇక్కడ కూడా భారీగా ప్రమోషన్లు చేస్తున్నారు. తెలుగు మీడియాకు కూడా ఆయన ఇంటర్వ్యూ లు ఇస్తున్నారు. కమల్ సినిమా వచ్చిన వారం రోజులకే పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు వస్తోంది. అసలు ప్రమోషన్లు లేకుండానే ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. పవన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత చేస్తున్న సినిమా ఇది. ఐదేళ్ల పాటు షూటింగ్ జ‌రుపుకున్న తర్వాత వస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్.


హరిహర వీరమల్లు సినిమాకు కూడా వారం రోజులకు మించి గ్యాప్ లేదు. ఆ మరుస‌టి వార‌మే కుబేర - 8 వసంతాలు వస్తున్నాయి. ధనుష్ - నాగార్జున రష్మిక లాంటి తారగణం నటించిన కుబేర. శేఖర్ కమ్ముల సినిమా ఇది. ఇక ఎనిమిది వసంతాలు సినిమా కూడా మైత్రి మూవీస్ బ్యాకింగ్ తో వస్తోంది. నెల చివరి వారంలో కన్నప్ప సినిమా రిలీజ్ అవుతుంది. మంచు విష్ణు నటించిన ఈ భారీ సినిమా 27న థియేటర్లలోకి వస్తుంది. ఇలా జూన్ నెలలో ప్రతివారం పెద్ద సినిమా వస్తోంది. ఈ నెల అంతా బాక్సాఫీస్ కలకలలాడిపోనుంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: