టాలీవుడ్ ఇండస్ట్రీ లో ప్రస్తుతం కాస్త డౌన్ ఫాల్లో కెరియర్ను కొనసాగిస్తున్న నటులలో నితిన్ ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభంలో అద్భుతమైన విజయాలను అందుకుంటూ ఫుల్ జోష్లో కెరియర్ను కొనసాగించాడు. ఆ తర్వాత కొంత కాలం పాటు నితిన్ వరుస పెట్టి అపజయాలను అందుకున్నాడు. మళ్ళీ ఈయన ఇష్క్ మూవీ తో విజయాన్ని అందుకుని ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు. ఆ తర్వాత నితిన్ కొంత కాలం పాటు మళ్ళీ కెరీర్ను మంచి దశలో కొనసాగించాడు. కానీ ఈ మధ్య కాలంలో వరుస పెట్టి అపజయాలను ఎదుర్కొంటూ వస్తున్నాడు. తాజాగా ఈయన రాబిన్ హుడ్ అనే సినిమాతో ప్రేక్షకులకు ముందుకు వచ్చాడు.

భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా కూడా ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం నితిన్ "తమ్ముడు" అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యి చాలా కాలమే అవుతుంది. ఈ సినిమా విడుదలకు సంబంధించి ఇప్పటికే ఎన్నో తేదీలు వచ్చాయి. కానీ ఇప్పటికీ కూడా ఈ మూవీ విడుదల కాలేదు. కొన్ని రోజుల క్రితమే ఈ సినిమాను జూలై 4 వ తేదీన విడుదల చేయనున్నట్లు. ఈ మూవీ మేకర్స్ ప్రకటించారు. దానితో ఈ సినిమా ఖచ్చితంగా జూలై 4 వ తేదీన విడుదల అవుతుంది అని చాలా మంది భావించారు.

కానీ ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమా జూలై 4 వ తేదీన విడుదల కావడం కష్టం అని , ఈ మూవీ ని జూలై 25 వ తేదీన విడుదల చేయాలి అనే ఆలోచనలు మేకర్స్ ఉన్నట్లు , అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా మరికొన్ని ఈ మూవీ బృందం వారు కొన్ని రోజుల్లో విడుదల చేయనున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇలా ఈ సినిమా మరోసారి వాయిదా పడనున్నట్లు వార్తలు ఉండటంతో నితిన్ అభిమానులకు కాస్త డిసప్పాయింట్ అవుతున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: