- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

బాలీవుడ్ యాక్షన్ హీరో సన్నీ డియోల్ నటించిన రీసెంట్ మూవీ జాట్. ఏప్రిల్ 10 రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలు తెలుగు ద‌ర్శ‌కుడు మ‌లినేని గోపీచంద్‌ డైరెక్ట్ చేయగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ - మైత్రి మూవీ మేకర్స్‌ సంయుక్తంగా నిర్మించాయి. దీంతో ఈ సినిమాకు తెలుగు ప్రేక్షకుల నుంచి కూడా మంచి రెస్పాన్స్ దక్కింది. వాస్తవానికి జాట్ సినిమాను బాలీవుడ్లో అందులోను హిందీలో మాత్రమే రిలీజ్ చేశారు. అయితే ఇప్పుడు జాట్ సినిమా ఓటిటి ప్రేక్షకులకు రెడీ అవుతోంది. ప్రముఖ ఓటిటి ప్లాట్ఫారం నెట్‌ఫ్లిక్స్ ఈ నెల ఐదు నుంచి ఈ సినిమా ను త‌మ ప్లాట్ ఫామ్‌లో స్ట్రీమింగ్ చేయ‌నుంది.


అయితే ఈ సారి జాట్ మేకర్ తెలుగు ఆడియన్స్ కు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చేశారు. థియేటర్లలో కేవలం హిందీలో మాత్రమే రిలీజ్ చేశారు. అయితే ఇప్పుడు జాట్ తెలుగు వెర్ష‌న్ ను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. దీంతో ఈ సినిమాలోని మాస్ డైలాగులు తెలుగులో కూడా పేల‌నున్నాయి. జాట్ సినిమాకు థ‌మ‌న్ టెర్రిఫిక్ సంగీతం అందించగా .... సన్నీ డియోల్ హీరోగా ... మరో స్టార్ రణదీప్ హూడా విలన్ గా నటించారు. జగపతిబాబు - రమ్యకృష్ణ - బిగ్ బాస్ దివి ఇతర పాత్రలలో నటించారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: