- ( టాలీవుడ్‌ - ఇండియా హెరాల్డ్ ) . . .

పాన్ ఇండియా విధ్వంసం బాహుబలి సినిమా కోసం ఎప్పుడైనా భారతీయ సినిమా ప్రేమికుడు ఎదురు చూస్తూనే ఉంటారు. తెలుగు సినిమాతో పాటు భారతీయ సినిమా రూపు రేఖలు మార్చేసి తెలుగు సినిమాను ఎల్లలు దాటించేసి ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పిన ఘనత బాహుబలి సినిమాకే దక్కుతుంది. రెండు భాగాలుగా వచ్చిన ఈ ప్రాంఛైజీ రికార్డు వసూలు సొంతం చేసుకుని చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా స్టార్ టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అలాగే దర్శకుడు రాజమౌళి ప్రాణం పెట్టి తీసిన ఈ సినిమాలు ఇప్పుడు రీ రిలీజ్ అవుతున్నాయి.


ప్రస్తుతం టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోని బాహుబ‌లి 1 , బాహుబలి 2 సినిమాలను రీ రిలీజ్‌ చేస్తున్నారు. ఈ సినిమా మొదటి పార్ట్ ని అక్టోబర్లో రిలీజ్ కోసం ఎనౌన్స్‌ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ మరొకటి బయటకు వచ్చింది. మేకర్స్ థియేటర్స్ లో సరికొత్త ట్రీట్ ఇవ్వబోతున్నారు. ఒకేసారి పార్ట్ వన్ . . పార్ట్ టూ ను విడుదల చేస్తారని తెలుస్తోంది. అందుకు తగినట్టుగా సినిమాను ట్రిమ్ చేసి ఒకే సినిమాగా మార్చి ఆదర్శం అక్టోబర్లో విడుదల చేస్తారని తెలుస్తోంది. దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: