
అమ్మ జీవితంలో ఏది కావాలంటే అది ఇస్తుందని శక్తికి మించినది అయినా అమ్మానాన్న మనకు ఇస్తుంటారని చెప్పుకొచ్చారు. నా దృష్టిలో మా అమ్మానాన్న కన్నప్పలు అని అన్నారు. మా అమ్మ పేరు లక్ష్మమ్మ అని అమ్మకు పుట్టుకతోనే రెండు చెవులు వినిపించవని మోహన్ బాబు చెప్పుకొచ్చారు. ఆ మహాతల్లికి పరమేశ్వరుడు ఐదు మంది సంతానాన్ని ఇచ్చాడని మోహన్ బాబు కామెంట్లు చేశారు.
బస్సు దిగి మా ఊరికి నడిచి వెళ్లాలంటే 7 కిలోమీటర్లు నడవాలని ఆ దారి కూడా సరిగ్గా ఉండేది కాదని మోహన్ బాబు అన్నారు. చెవులు వినిపించని నా తల్లి ఐదు మంది బిడ్డల్ని మోసుకుని మా ఊరికి వెళ్లేదంటే ఎంత కష్టమో ఆలోచించండని మోహన్ బాబు అన్నారు. దారిలో ఒక కాలువ, సువర్ణముఖి నది దాటి వెళ్లాలని మాది ద్వీపం లాంటి ఊరు మోహన్ బాబు వెల్లడించడం గమనార్హం.
ఈ విషయాలు తలచుకుంటే ఒళ్లు గగుర్పొడుస్తుందని మోహన్ బాబు పేర్కొన్నారు. నా కంఠన్ని అందరూ మెచ్చుకుంటున్న సమయంలో నా మాటలు తల్లికి వినిపించి ఉంటే ఎంత బాగుండేదని అనిపిస్తుందని మోహన్ బాబు అన్నారు. నాకు నా కన్నతల్లే కన్నప్ప అని కామెంట్లు చేశారు. మోహన్ బాబు చేసిన ఈ ఎమోషనల్ కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మోహన్ బాబు మరెన్నో విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.