నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందుతున్న హై వోల్టేజ్ యాక్షన్ ఫిల్మ్ `అఖండ 2`. 2021లో విడుదలైన బ్లాక్ బస్టర్ మూవీ `అఖండ`కు సీక్వెల్ ఇది. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా సెప్టెంబర్ 25న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఒకరోజు ముందే అంటే జూన్ 9వ తేదీ రాత్రి అఖండ 2 టీజర్ ను విడుదల చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ టీజ‌ర్ కు సినీ ప్రియుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

కేవలం 24 గంటల్లోనే అఖండ 2 టీజర్ ఏకంగా 24 మిలియన్ల‌ వ్యూస్ ను సొంతం చేసుకుంది. అలాగే 5.90 లక్షలకు పైగా లైకులు సాధించి యూట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. వ్యూస్ పరంగా టాలీవుడ్ టాప్ 10 టీజర్స్ లో అఖండ 2 నెంబర్ ఎంతో తెలిస్తే కచ్చితంగా షాక్ అవుతారు. ఎందుకంటే, ప్ర‌భాస్ `రాధేశ్యామ్` మూవీ టీజ‌ర్ 42.67 మిలియ‌న్ వ్యూస్ తో టాప్ 1లో ఉండ‌గా.. రామ్ చ‌ర‌ణ్ `గేమ్ ఛేంజ‌ర్‌` టీజ‌ర్ 32.40 వ్యూస్‌తో టాప్ 2లో ఏంది. 24 మిలియ‌న్ వ్యూస్ తో అఖండ 2 టీజ‌ర్ టాప్‌-3లో నిలిచింది. దీంతో నంద‌మూరి అభిమానుల ఆనందానికి హ‌ద్దే లేకుండా పోయింది.

టాలీవుడ్ టాప్ వ్యూస్ ను సొంతం చేసుకున్న టీజ‌ర్స్ ను గ‌మ‌నిస్తే..

- రాధేశ్యామ్ టీజ‌ర్ : 42.67 మిలియ‌న్లు
- గేమ్ ఛేంజ‌ర్ టీజ‌ర్ : 32.40 మిలియ‌న్లు
- అఖండ2 టీజర్ : 24 మిలియ‌న్లు+
- విశ్వంభర టీజర్ : 20.95 మిలియ‌న్లు
- బ్రో టీజ‌ర్ : 20.50 మిలియ‌న్లు
- హిట్‌3 టీజర్ : 17.12 మిలియ‌న్లు
- సరిలేరు నీకెవ్వరు : 14.64 మిలియ‌న్లు
- రామరాజు ఫర్ భీమ్(ఆర్ఆర్ఆర్‌) : 14.14 మిలియ‌న్లు
- సాహో టీజర్ : 12.94 మిలియ‌న్లు
- భోళా శంక‌ర్‌ టీజర్ : 12.37 మిలియ‌న్లు


మరింత సమాచారం తెలుసుకోండి: