లోక నాయకుడు కమల్ హాసన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో సినిమాలలో నటించి ఎన్నో అద్భుతమైన విజయాలను అందుకొని ఇండియా వ్యాప్తంగా నటుడిగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. కానీ ఈయన అనేక సంవత్సరాల పాటు చాలా అపజయాలను ఎదుర్కొన్నాడు. దానితో ఈయన కెరియర్ గ్రాఫ్ కూడా చాలా వరకు పడిపోయింది. అలాంటి సమయం లోనే కమల్ , లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందిన విక్రమ్ అనే సినిమాలో హీరోగా నటించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాతో కమల్ ఈమేజ్ మళ్ళీ ఒక్క సారిగా భారీగా పెరిగిపోయింది. విక్రమ్ లాంటి భారీ విజయం తర్వాత కమల్ , శంకర్ దర్శకత్వంలో ఇండియన్ 2 సినిమాలో హీరో గా నటించాడు. ఈ సినిమా మాత్రం కమల్ కి తీవ్ర నిరాశను మిగిల్చింది. ఇండియన్ 2 లాంటి భారీ అపజయం తర్వాత కమల్ , మణిరత్నం దర్శకత్వంలో థగ్ లైఫ్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమా తాజాగా విడుదల అయింది.

సినిమా ద్వారా కూడా కమల్ కి భారీ అపజయం దక్కే అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన 6 రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ 6 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 40 కోట్ల షేర్ ... 81.40 కోట్ల గ్రాస్ కలెక్షన్లు మాత్రమే దక్కాయి. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 106.50 కోట్ల టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. దానితో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని క్లీన్ హీట్ గా నిలవాలి అంటే మరో 66.50 కోట్ల షేర్ కలెక్షన్లను రాబట్టవలసి ఉంది. ఇక ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఈ మూవీ హిట్ స్టేటస్ ను అందుకోవడం చాలా కష్టం గానే కనబడుతుంది అని అనేక మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: