
ప్రశాంత్ వర్మ - మోక్షజ్ఞ సినిమాపై కాన్సన్ట్రేషన్ చేయలేదు అని ఆకారణంగానే బాలయ్య కోపం వచ్చి ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేసేసాడు అని టాక్ వినిపించింది. ఆదిత్య 999 ప్రాజెక్టులో మోక్షజ్ఞను భాగం చేయాలి అంటూ ఫిక్స్ అయిపోయాడు బాలయ్య . అదే విధంగా ప్లాన్ ముందుకు వెళ్లాల్సి ఉండింది . కానీ ఇప్పుడు క్రిష్ ఖాతాల్లో నుంచి కూడా ఈ ప్రాజెక్టు చేతులు మారిపోయినట్లు తెలుస్తుంది. క్రిష్ ని ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పించేసాడు బాలయ్య అంటూ ఓ న్యూస్ బయటకి వచ్చింది ఈ స్థానంలోకి మళ్ళీ స్టార్ట్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మనే వచ్చాడు అంటూ ఓ న్యూస్ తెరపైకి వచ్చింది .
బాలయ్య - ప్రశాంత్ వర్మలకు బాగా దగ్గరగా ఉండే ఒక టాప్ ప్రొడ్యూసర్ వీళ్ళిద్దరిని మళ్ళీ కలిపారట . అంతేకాదు ఆయనే ఇది ప్రొడ్యూస్ చేయబోతున్నాడట. సోషియో ఫ్యాంటసి మూవీలు అంటే ప్రశాంత వర్మకి బాగా ఇంట్రెస్ట్. ఆయన సినిమాలలో అది బాగా గమనించొచ్చు. ఆ కారణంగానే ఈ మూవీను క్రిష్ దగ్గర నుంచి తిరిగి మళ్ళీ ప్రశాంత్ వర్మ చేతుల్లోకి వచ్చేలా ప్రొడ్యూసర్ పక్కాగా మాట్లాడి స్కెచ్ వేశారట . అందుకే బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా ఆదిత్య 999 కి సంబంధించిన అప్డేట్ ఏదీ రాలేదు అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. క్రిష్ చేతుల్లో నుంచి ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు ప్రశాంత్ వర్మ చేతిలోకి వెళ్లిపోయింది అన్న టాక్ బాగా ట్రెండ్ అవుతుంది. అయితే దీనిపై అఫీషియల్ ప్రకటన లేకపోవడంతో ఇది కూడా ఫేక్ న్యూస్ అనుకుంటున్నారు నందమూరి అభిమానులు. బాలయ్య త్వరగా రెస్పాండ్ అయ్యి మోక్షజ్ఞ ఎంట్రీ పై గుడ్ న్యూస్ చెప్తే బాగుంటుంది అంటూ కోరుకుంటున్నారు..!