తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి తెలుగు సినీ ఇండస్ట్రీలోని వారికి గద్దర్ అవార్డుల ప్రధానోత్సవం చేసిన సంగతి మనకు తెలిసిందే. 2014 నుండి 2024 వరకు బెస్ట్ సినిమాలు ప్రేక్షకాధరణ పొందిన సినిమాలకు గద్దర్ అవార్డుల ప్రధానోత్సవం చేశారు. అలాగే బెస్ట్ హీరో, బెస్ట్ హీరోయిన్,సపోర్టింగ్ ఆర్టిస్టులు,మ్యూజిక్ డైరెక్టర్లు, డైరెక్టర్లు ఇలా ఎంతో మందికి గద్దర్ అవార్డులు ఇచ్చి సన్మానించారు.అయితే ఇందులో భాగంగా రేవంత్ రెడ్డి స్టేజ్ మీద ఓ డైరెక్టర్ ని అభ్యర్థిస్తూ మీకేం కావాలో చెప్పండి అని అడిగిన వీడియో ప్రస్తుతం మీడియాలో వైరల్ గా మారింది.రాష్ట్రానికే పెద్దగా ఉన్న ముఖ్యమంత్రి ఓ డైరెకర్ ని ఏం కావాలో చెప్పండి అని అడగడం అంటే మామూలు విషయం కాదు.మరి ఇంతకీ రేవంత్ రెడ్డి అంతగా వేడుకున్న ఆ డైరెక్టర్ ఎవరయ్యా అంటే.. రాజమౌళి.

అయితే గద్దర్ అవార్డ్స్ ఫంక్షన్ లో పాల్గొన్న రేవంత్ రెడ్డి స్టేజ్ మీద మాట్లాడుతూ.. సినిమా వాళ్లకు మేము ఎప్పుడు అండగానే ఉంటాం. 2047 కల్లా తెలంగాణ ఎకానమీ 3 ట్రిలియన్ లకి చేరుకోవడం అన్నదే నా కల.. మేం సినిమా ఇండస్ట్రీ తో కఠినంగా ఉంటాం అని అనుకుంటారు. కానీ మేము కఠినంగా ఉన్నట్టు కనిపిస్తాం.కానీ సినీ ఇండస్ట్రీకి ఎప్పుడు సహాయం చేస్తూనే ఉంటాం.నేను ఎప్పటికీ ఇక్కడి రాజకీయాల్లోనే ఉంటా. మీకు ఎప్పుడు ఏ అవసరం కావాలన్నా సహాయం చేస్తా. ఏ హోదాలో ఉన్న నా వంతు సాయం చేస్తా.. హాలీవుడ్ అంటే అమెరికాకి బాలీవుడ్ అంటే ముంబైకి వెళ్తున్నారు.కానీ అక్కడివాళ్లు మన తెలుగు సినిమా పరిశ్రమ ఎదిగితే ఇక్కడికి ఎందుకు రారు అని నేను రాజమౌళిని అడుగుతున్నా..

 హాలీవుడ్ బాలీవుడ్ అనేది హైదరాబాద్ గడ్డ మీదే ఉండాలి.దానికోసం రాష్ట్ర ప్రభుత్వం మీకు ఎల్లవేళలా సాయం చేస్తూనే ఉంటుంది.మీకు ఏం కావాలో చెప్పండి ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు, ప్రముఖులు ఏం అడిగితే రాష్ట్ర ప్రభుత్వం అది మీకు ఇవ్వడానికి రెడీగా ఉంది. ఒకప్పుడు తెలుగు సినిమా పరిశ్రమ అంటే చెన్నై అనేవారు.కానీ ఇప్పుడు హైదరాబాద్ అంటున్నారు అంటే అదంతా మీరు తీసిన సినిమాలే. ఈరోజు గద్దర్ గారి పేరుతో ఈ అవార్డులను ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉంది. 2014 నుండి ఇప్పటివరకు సినిమాల ద్వారా ప్రేక్షకాధరణ పొందిన వారికి ఈ అవార్డులు ఇస్తున్నాము అంటూ రేవంత్ రెడ్డి మాట్లాడారు. అలా లైవ్ లోనే రేవంత్ రెడ్డి రాజమౌళి పేరును ప్రస్తావించి అడగిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: