ఇది అందరికీ తెలిసిందే . ప్రశాంత్  నీల్ కి ఎన్టీఆర్ అంటే మహా మహా ఇష్టం.  చాలా సందర్భాలలో ఆ విషయం బయటపడింది.  మరీ ముఖ్యంగా ఇప్పుడు ప్రశాంత్ నీల్  తెరకెక్కిస్తున్న సినిమా విషయంలో ఆయన తీసుకుంటున్న శ్రద్ధ చూస్తే  ఎన్టీఆర్ అంటే అభిమానం ఇష్టం కాదు దానికి మించిన రేంజ్ లోనే ఉంది అన్న విషయాన్ని హైలెట్ చేస్తుంది. సోషల్ మీడియాలో ఇప్పుడు ప్రశాంత్ నీల్- ఎన్టీఆర్ కి సంబంధించిన ఓ న్యూస్ బాగా హైలెట్ అవుతుంది. ప్రశాంత్ నీల్ - ఎన్టీఆర్ కాంబోలో సినిమా రాబోతున్న విషయం అందరికీ తెలిసిందే . ఈ సినిమా అనౌన్స్మెంట్ ఎప్పుడో ఇచ్చారు .

కానీ ఇంకా ఈ సినిమా సెట్స్ పైనే ఉంది . కాగా ఈ సినిమా కోసం ప్రశాంత్ నీల్   చాలా చాలా కష్టపడుతున్నాడు అని .. ఒక్కొక్క సీను ఒక్కొక్క లెవెల్లో రాసుకున్నాడు అని .. అంతే వేరే లెవెల్ లో ఎన్టీఆర్ ని చూపించడానికి బాగా ట్రై చేస్తున్నాడు అని మేకర్స్ దగ్గర నుంచి సమాచారం అందుతుంది . కాగా ఈ సినిమాలో ఎన్టీఆర్ ఫ్యాన్స్  మీసం మెలివేసేలా కొన్ని సీన్స్ ఉండబోతున్నాయట . మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోసం స్పెషల్గా సీక్వెన్స్ ని డిజైన్ చేశారు అంటూ టాక్ వినిపిస్తుంది . అంతేకాదు ఎన్టీఆర్ ఎంట్రీ సీన్ కోసం ప్రశాంత్ నీల్ దాదాపు 25 కోట్లు ఖర్చు చేస్తున్నాడట .

ఈ సీన్ లో వెయ్యి మందికి పైగా జూనియర్స్ కూడా స్క్రీన్ లో కనిపించబోతున్నారట . ఇది టోటల్గా యాక్షన్ సీక్వెన్స్ సీన్ అంటూ కూడా తెలుస్తుంది . ఈ మూవీకి టైటిల్ డ్రాగన్ అంటూ ప్రచారంలో ఉంది . డ్రాగన్ అనే టైటిల్ పర్ఫెక్ట్ గా ఈ కథకు మ్యాచ్ అవుతుందట . ఈ సినిమాలో రుక్మిణి వసంత్  హీరోయిన్గా నటిస్తుంది . అంతేకాదు ఈ సినిమాలో స్పెషల్ సాంగ్లో స్టార్ హీరోయిన్ శృతిహాసన్ మెరవబోతున్నట్లు కూడా న్యూస్ బయటకు వచ్చింది . ఈ సినిమాకి సంబంధించి ఒక్కో న్యూస్ బయటకు వస్తూ ఉండడంతో అభిమానులు ఫుల్ ఎక్సైట్ అయిపోతున్నారు. చూడాలి ప్రశాంత్ నీల్- ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని ఏ మేర సాటిస్ఫై చేస్తాడు  అనేది..???


మరింత సమాచారం తెలుసుకోండి: