
అయితే ఈ గ్యాప్ లోనే క్రిష్ "కొండపొలం" అనే సినిమాను షూట్ చేసి రిలీజ్ కూడా చేసేసారు . ఆ తర్వాత "ఘాటీ" అనే సినిమాను కూడా తెరకెక్కించాడు . త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. కానీ హరిహర వీరమల్లుకు మాత్రం ఇంకా మోక్షం రావడం లేదు. ఒక డైరెక్టర్ ఒక సినిమాని అనౌన్స్ చేసి దాదాపు 5 ఏళ్లు దాని కోసం టైం కేటాయించి .. ఈలోపు మధ్యలో రెండు సినిమాలను తెరకెక్కించాడు అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. హరిహర వీరమల్లు సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటూ కొన్నిసార్లు పవన్ ఫ్యాన్స్ కూడా కూసింత అసహన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఘాటుగా రియాక్ట్ అయ్యారు . అయినా మేకర్స్ రెస్పాన్స్ ఇవ్వాలా..? వద్దా..? అన్నట్లు ఉన్నారు.
ఏదో జూన్ 12వ తేదీ రిలీజ్ చేస్తారు అనుకున్న మూమెంట్లో మళ్లీ సినిమా పోస్ట్ పోన్ అవుతుంది అంటూ మూవీ మేకర్స్ అనౌన్స్ చేశారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం జూలై 18వ తేదీ ఈ సినిమాని రిలీజ్ చేయాలి అంటూ ప్లాన్ చేస్తున్నారట . అయితే ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది మాత్రం తెలియడం లేదు . ఈ గ్యాప్ లో హరిహర వీరమల్లు సినిమా పేరును కూడా కొంతమంది పవన్ ఫ్యాన్స్ మర్చిపోతున్నారు. అదేదో అప్పుడెప్పుడో క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ సినిమా యాక్సెప్ట్ చేశాడు ..ఏంటి ఆ మూవీ ..?? అంటూ రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు .
మిగత పవన్ సినిమాలతో కంపేర్ చేస్తూ హరిహర వీరమల్లుని టార్గెట్ చేసిన మరి ట్రోల్ చేస్తున్నారు . సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ కి ఇది ఒక బిగ్ తలనొప్పిగా మారిపోయింది . ఏ హీరో అభిమాని అయినా సరే తమ హీరో సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురవుతుంటే చూడలేరు. కానీ ఈ విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏమీ చేయలేకపోతున్నారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ విషయంలో సపోర్ట్ చేయడానికి కూడా ఏం లేదు. పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు ఎప్పుడు థియేటర్స్ లో రిలీజ్ అవుతుందో..?? ఎప్పుడు ఆ సినిమాని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చూస్తారో..?? ఆ దేవుడికే తెలియాలి అంటూ కొంతమంది ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు..!!