ఈరోజు విడుదలైన ది రాజాసాబ్ సినిమా టీజర్ ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. మూడు గంటల్లోనే ఈ టీజర్ కు ఏకంగా 3.6 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. కమర్షియల్ అంశాలు ఉంటూనే కొత్త తరహా కాన్సెప్ట్ తో సినిమా తెరకెక్కిందని టీజర్ తో క్లారిటీ వచ్చేసింది. అయితే ఇప్పటికీ ప్రభాస్ ఫ్యాన్స్ మదిలో కొన్ని సందేహాలు ఉండగా ఆ ప్రశ్నలకు మారుతి సమాధానం ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు.


ప్రభాస్ కామెడీ టైమింగ్ ను పాన్ ఇండియాకు చూపించాలని అనుకున్నానని  సినిమా కథకు అనుగుణంగా గ్రాండ్ సెట్స్ నిర్మించామని మారుతి అన్నారు.  ప్రభాస్ డైరెక్టర్ల హీరో అని  పాత్రలో ఒదిగిపోయి నటిస్తారని ఆయన చెప్పుకొచ్చారు.  ఈ జానర్ సినిమా చేద్దామని ప్రభాస్ అడిగారని  ప్రభాస్ నన్ను నమ్మడంతో ఈ తరహా సినిమాను తెరకెక్కించానని  నేను ఎంపిక చేసుకున్న కథ బాగా వర్కౌట్ అయిందని తెలిపారు.


ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందో లేదో  షూటింగ్ పూర్తయ్యాక చూద్దామని  రాజాసాబ్ సినిమా కొరకు 18 గంటలు వర్క్ చేశామని  మూడు గంటల నిడివితో సినిమా రిలీజ్ కానుందని  మారుతి అన్నారు.  సినిమాలో హీరో ఎంట్రీ సాంగ్ ఉంటుందని  ముగ్గురు హీరోయిన్లతో సాంగ్ ఉంటుందని థమన్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారని ఆయన వెల్లడించారు.  సినిమాలో సంజయ్ దత్  రోల్ అద్భుతంగా ఉంటుందని నిర్మాత విశ్వప్రసాద్ తెలిపారు.


విజువల్ ఎఫెక్ట్స్ పనుల కోసమే 300 రోజుల సమయం కేటాయించామని  40 నిమిషాల క్లైమాక్స్ సినిమాకు హైలెట్ అని అన్నారు.  రాజాసాబ్   క్వాలిటీ విషయంలో రాజీ పడలేదని  పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ కు  ఈ సినిమా భారీ ప్రాజెక్ట్ కానుందని నిర్మాత కామెంట్లు  చేశారు.  ప్రభాస్ కు వీరాభిమాని అయిన మారుతి  ఈ సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ల జాబితాలో చేరతారేమో చూడాల్సి ఉంది.   నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కిందని టీజర్ చూస్తే క్లారిటీ వచ్చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: