ఏంటి బాలకృష్ణ ఆ నటుడి కాపురంలో నిజంగానే చిచ్చుపెట్టారా..భార్యాభర్తలకి మధ్య గొడవ పెట్టి నవ్వుకున్నారా.. ఆ నటుడి ముందే తన భార్యకి ఫోన్ చేసి అలా చెప్పారా..బాలకృష్ణ చెప్పిన మాటల కారణంగా భార్యాభర్తల మధ్య అంతపెద్ద గొడవ జరిగిందా అనేది ఇప్పుడు చూద్దాం.. బాలకృష్ణ తన సినిమాల్లో కొంతమంది ఆర్టిస్టులను రిపీటెడ్ గా తీసుకుంటూ ఉంటారు. అలాంటి వారిలో నటుడు సమీర్ కూడా ఒకరు. బాలకృష్ణ నటించిన ఏ సినిమాలో అయినా సమీర్ ఏదో ఒక చిన్న పాత్రలో అయినా కనిపిస్తారు.అలా బాలకృష్ణకి సమీర్ కి మధ్య మంచి బాండింగ్ ఉంది.అయితే ఈ బాండింగ్ ఇలా కొనసాగుతున్న తరుణంలో బాలకృష్ణ ఓసారి సమీర్ కి ఆయన భార్యకి మధ్య చిచ్చు పెట్టారట.. 

సమీర్ ముందే ఆయన భార్యకి కాల్ చేసి చెప్పకూడనివి అన్ని చెప్పడంతో సమీర్ కి ఫోన్ చేసి ఫైర్ అయ్యిందట. మరి ఇంతకీ బాలకృష్ణ సమీర్ భార్యకు ఫోన్ చేసి ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం.సమీర్ ఓ ఇంటర్వ్యూలో బాలకృష్ణ చేసిన చిలిపి పని గురించి మాట్లాడుతూ.. నేను బాలకృష్ణ సార్ తో ఓ సినిమాలో చేస్తున్నాను.ఆ సినిమా షూటింగ్ సమయంలో సరదాగా అందరం కూర్చుని మాట్లాడుకుంటున్నాం. అదే సమయంలో బాలయ్య బాబు నన్ను మీ ఆవిడ నెంబర్ ఇవ్వు అని అడిగారు.దానికి నేను భయపడి అదేంటి మా ఆవిడ నెంబర్ అడుగుతున్నారు ఈయనేం చేస్తారని భయపడుకుంటూనే మా వైఫ్ నెంబర్ ఎందుకు సార్ అని అన్నాను.

ఏంటి మీ వైఫ్ నెంబర్ నాకు ఇవ్వవా అని కాస్త దబాయించారు. దాంతో నా భార్య నెంబర్ ఇచ్చాను. ఇక లైవ్లో అందరూ ఉండగానే నా భార్యకు ఫోన్ చేసి నేను బాలకృష్ణని అని చెప్పారు.ఏ బాలకృష్ణ అని నా భార్య అడగగా.. నందమూరి బాలకృష్ణ అని చెప్పారు. దాంతో నా భార్య భయపడుతూ సార్ మీరెందుకు నాకు కాల్ చేశారు. చెప్పండి సార్ అని మాట్లాడింది.సమీర్ ఎక్కడికి వెళ్ళాడమ్మా.. షూటింగ్ కి రాలేదు. ఆయన షూటింగ్ కి వస్తాడా..రాడా.. ఒకవేళ రాకపోతే చెప్పు షూటింగ్ ప్యాకప్ చెప్పుకొని ఇంటికి వెళ్ళిపోతాం అని మాట్లాడాడు.

ఇక ఆ తర్వాత నా భార్య సరే నేను ఒకసారి కాల్ చేసి మళ్లీ మీకు చెబుతాను అని కాల్  కట్ చేసి నాకు ఫోన్ చేసి తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టింది.దాంతో నేను ఎంత చెప్పినా కూడా వినకుండా మాట్లాడింది. దాంతో మా ఇద్దరి మధ్య గొడవ చూడలేక బాలకృష్ణ స్వయంగా ఫోన్ తీసుకొని సారీ అమ్మా నేనే సరదాగా మిమ్మల్ని ఆటపట్టించాను. సమీర్ షూటింగ్లోనే ఉన్నాడు అని చెప్పారు.ఇక బాలయ్య బాబు చెప్పడంతో మా ఇద్దరి మధ్య గొడవ సర్దుమనిగింది. లేకపోతే ఇంటికి వెళ్ళాక నాకు బడితే పూజే అంటూ సమీర్ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: